క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ లో నటిస్తున్నారు. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన “పుష్పక విమానం”మూవీ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు .ఆ మూవీ నవంబర్ 12న రిలీజ్ కానుంది. “పుష్పక విమానం”మూవీకి నిర్మాతగా వ్యవహరించిన విజయ్ తమ్ముడితో కలిసి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు . ఒక ఇంటర్వ్యూల్లో తనకిష్టమైన నటుల గురించి విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు , హిందీలో అయితే రణబీర్ కపూర్ తనకిష్టమైన నటులుఅనీ , ఇక హాలీవుడ్ లో అయితే డేంజెల్ వాషింగ్టన్., మెరిల్ స్ట్రీప్ లను ఆరాధిస్తాను అని చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: