‘రాధేశ్యామ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

#RadheShyam, Latest Telugu Movie News, latest telugu movies 2021, Pooja Hegde, Radhe Shyam First Single Release Date Announced, Prabhas Radhe Shyam Movie, Prabhas Upcoming Movies, Radhe Shyam First Single, Radhe Shyam Movie First Song, Radhe Shyam Movie First Song Release Date Announced, Radhe Shyam Movie Latest News, Radhe Shyam Movie Songs, Radhe Shyam Movie Updates, Radhe Shyam Songs, Radhe Shyam Telugu Movie, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఒక సినిమా తరువాత మరొక సినిమా పూర్తవుతున్నాఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇందులో ఫస్ట్ లిస్ట్ లో ఉన్న సినిమా రాధేశ్యామ్. రాాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. దానికి తోడు అప్ డేట్స్ కూడా చాలా తక్కువగానే వచ్చాయి. దీంతో అభిమానులు నిరాశ చెందుతూనే ఉన్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా నుండి అప్ డేట్ వచ్చింది. నిజానికి ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాాలా కాలం అయింది. అయితే ఈమధ్యే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ కు మూహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 15వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022, జనవరి 14న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 1 =