ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 87
ఇక రీమేక్ సినిమాలు చేయను..!
లాక్ డౌన్ ఒక కొత్త అనుభవం - పాయల్ రాజ్ పుత్
సమంత ఛాలెంజ్ ను పూర్తి చేసిన రష్మిక..!
లాక్ డౌన్ పై సోను సూద్ బుక్

నాన్నతో ఆ మూమెంట్ ను ఎప్పుడూ మరిచిపోలేను..!

నేను ఏ పాత్ర చేసినా అది నాలో ఉన్న క్యారెక్టరే..!
ఇన్ స్టాగ్రామ్ లో 11 మిలియన్ ఫాలోవర్స్
రోడ్డు పై డ్యాన్స్ చేస్తా - అంజలి
'నాంది' లో అందుకే నగ్నంగా చేశాను..!
నభా నటేష్ క్యూట్ లుక్
కార్తికేయ, ఇషా లతో కరోనా పై 'చిరు' వీడియో..!
మహేష్ 'జిమ్' స్నీక్ పీక్ వీడియో..!
లాక్ డౌన్ ఎన్నో విషయాలు నేర్పుతుంది..!
ఢిల్లీ టు హైదరాబాద్
మూవీ ఫీచర్ : దాన వీర శూర కర్ణ
రామ కృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై నందమూరి తారక రామారావు నటించి , నిర్మించి, దర్శకత్వం వహించిన హిందు మైథలాజికల్ ఫిల్మ్ "దాన వీర శూరకర్ణ " 1977 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 10 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 2 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. "దాన వీర శూరకర్ణ " మూవీ లో కర్ణ , దుర్యోధన, కృష్ణుడు గా ఎన్టీఆర్ నటించగా ఆయన తనయులు హరికృష్ణ అర్జునుడు , బాలకృష్ణ అభిమన్యుడు గా నటించారు.
ఇక రీమేక్ సినిమాలు చేయను..!
2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్లో ‘బెహెన్ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. దానికి రిలేషన్ షిప్ లో ఉండటం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత బుల్లితెరపై కూడా సందడి చేసింది ఈ భామ.
నెటిజెన్ కు అవార్డ్ పంపిస్తా అంటున్న మెగా డాటర్..!
మెగా డాటర్ నిహారిక కాస్త చమత్కారంగానే సమాధానం చెప్తుందని ఇంతకుముందు పలు సందర్భాల్లో చూసాం. ఇక ఈసారి మరోసారి నెటిజెన్ కు కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో నిహారిక యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు అడిగిన పలు సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ నెటిజెన్ `మీ ఫేస్ మీద పింపుల్ చూశా` అని స్పందించిన నిహారిక.. `కంగ్రాట్స్.. అవార్డు ఇంటికి పంపిస్తాన`ని రిప్లై ఇచ్చింది. అలాగే `మీ ఫోన్ వాల్ పేపర్ ఏంట`ని మరోకరు ప్రశ్నించగా.. కాబోయే భర్త చైతన్యతో దిగిన ఫొటోను వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని తెలిపింది.
లాక్ డౌన్ ఒక కొత్త అనుభవం - పాయల్ రాజ్ పుత్
సూపర్ హిట్ "RX 100 " మూవీ తో తన అందం , అభినయం తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం "నరేంద్ర "(తెలుగు ) "ఏంజెల్ "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ముంబై ఫ్లాట్ కు పరిమితం అయిన పాయల్ జూన్ 12 వ తేదీ ఢిల్లీ లోని తన స్వంత ఇంటికి చేరుకున్నారు. లాక్ డౌన్ గురించి పాయల్ మాట్లాడుతూ .. లాక్ డౌన్ ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అని , లాక్ డౌన్ ప్రజలకు చాలా నేర్పిందని చెప్పారు.
సమంత ఛాలెంజ్ ను పూర్తి చేసిన రష్మిక..!
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` 3 విడత ఛాలెంజ్‌లో సెలబ్రిటీస్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఛాలెంజ్ ను స్వీకరించి ఎంతో మంది ఇప్పటికే మొక్కలు నాటి.. ఆ ఛాలెంజ్ ను పలువురికి విసురుతున్నారు. ఇక తాజాగా ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన రష్మిక తన ఛాలెంజ్ ను పూర్తి చేసింది. అక్కినేని నాగార్జున ఛాలెంజ్ ను స్వీకరించిన సమంత.. తను ఆ ఛాలెంజ్ ను పూర్తిచేసి రష్మికకు కూడా నామినేట్ చేసింది. ఇక సమంత నుంచి ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ హీరోయిన్ రష్మిక తాజాగా తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటింది. ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ..ఈ ఛాలెంజ్‌కు తనను నామినేట్ చేసిన సమంతకు…
త్వరలో రానున్న ఎంఎస్ రాజు మూవీ 'డర్టీ హరి' ట్రైలర్..!
ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు దాదాపు 12ఏళ్ల తరువాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్ రాజు తాజాగా 'డర్టీ హరి' అనే సినిమాతో వస్తున్నారు. ఇక తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ను చూస్తుంటే. ఇక ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్టు చెపుతున్నారు నిర్మాతలు.
బ్లడ్ ప్లాస్మా కై రాజమౌళి &విజయ్ సేతుపతి రిక్వెస్ట్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ప్రజల దైనందిక జీవితంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారత దేశంలో కరోనా విజృభిస్తుంది. ఈ వ్యాధికి మెడిసిన్ వచ్చేవరకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భారత దేశం లో ఈ రోజు వరకు 9లక్షల 36 వేల మంది కరోనా బారిన పడ్డారు. 60 వేల మంది వరకు రికవర్ కాగా 24 వేల మంది మరణించారు.
లాక్ డౌన్ పై సోను సూద్ బుక్
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ప్రజలు పలు ఇబ్బందులకు గురి అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ బాధితులకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా అనేక రకాలుగా సహాయం అందించారు. మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసిన విషయం తెలిసిందే. రీల్ విలన్ సోను సూద్ వలస కార్మికులకు సహాయం అందిస్తూ రియల్ హీరోగా మారారు.

నాన్నతో ఆ మూమెంట్ ను ఎప్పుడూ మరిచిపోలేను..!
విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాను త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.

నేను ఏ పాత్ర చేసినా అది నాలో ఉన్న క్యారెక్టరే..!
మన సినిమాలో చేసే పాత్రలు మనలోనే ఉంటాయి అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా ఇలా ప్రతి సినిమాలోనూ తనను కొత్తగా ఆవిష్కరించుకుంటూ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతమంది యంగ్ హీరోలు ఎన్నో ఏళ్ళనుండి టాలీవుడ్ లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. కానీ విజయ్ మాత్రం చాలా తక్కువ టైంలోనే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.
ఇన్ స్టాగ్రామ్ లో 11 మిలియన్ ఫాలోవర్స్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన "అల.. వైకుంఠపురము లో .." మూవీ ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం, ఈ మూవీ లోని "బుట్ట బొమ్మా ", "సామజవరగమన" సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ లభించడం తో పూజాహెగ్డే సంతోషం గా ఉన్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే పూజాహెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో 11 మిలియన్ ఫాలోవర్స్ తో ఈ రోజు రికార్డ్ క్రియేట్ చేశారు.
రోడ్డు పై డ్యాన్స్ చేస్తా - అంజలి
తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అంజలి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు ", "గీతాంజలి "(తెలుగు ), "అంగడి తెరు ", ఎంగేయుమ్ ఎప్పోదుమ్ "(తమిళ ) మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. అంజలి ప్రస్తుతం 3తెలుగు , 3 తమిళ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
'నాంది' లో అందుకే నగ్నంగా చేశాను..!
విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.
నభా నటేష్ క్యూట్ లుక్
కాలేజ్ డేస్ లో నాటకాలలో నటిస్తూ , మోడలింగ్ చేసిన నభా నటేష్ , కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన సక్సెస్ ఫుల్ "వజ్రకాయ" కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించారు. సుధీర్ బాబు హీరోగా రూపొందిన "నన్ను దోచుకుందువటే " మూవీ తో నభా నటేష్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తరువాత "అదుగో " మూవీ లో నటించిన నభా నటేష్ బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని, గుర్తింపు పొందారు. పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.
కార్తికేయ, ఇషా లతో కరోనా పై 'చిరు' వీడియో..!
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలకు పలు సూచనలు జాగ్రత్తలు ఇస్తూ ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ వీడియోలు మెసేజ్ లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మెగా స్టార్ చిరు అయితే దీనికి సంబంధించి ఎన్నో వీడియోలు పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈసారి యువ నటీనటులను కూడా తన వీడియోలో వాడుతూ మరోసారి కరోనా గురించి తనదైన శైలిలో వివరించే ప్రయత్నం చేశారు.
మహానటి 'సావిత్రి' చేతిలో ఉన్న అగ్ర హీరో ఎవరో తెలుసా..?
పైన ఫొటోలో మహానటి సావిత్రి ఎత్తుకున్న అగ్ర హీరో ఎవరనే ఆలోచిస్తున్నారు కదా. అది తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం వెలుగు నీడలు. 1961 లో వచ్చిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని కూడా అన్నపూర్ణ పిక్చర్స్ పైనే నిర్మించారు. జగ్గయ్య , ఎస్.వి.రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి వెంకటరామయ్య, సూర్యకాంతం, గిరిజ, రాజసులోచన, పద్మనాభం, పేకేటి శివరామ్, ఇ.వి.సరోజ, ముఖ్యపాత్రలో నటించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. ఇక అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
పేద విద్యార్థులకు అండగా - 4 పాఠశాలలను దత్తత తీసుకున్న సుదీప్..!
హీరోలు కేవలం సినిమాలే కాదు మరోవైపు సామాజిక సేవల్లో కూడా బాగానే పాల్గొంటారు. కన్నడ హీరో సుదీప్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
మహేష్ 'జిమ్' స్నీక్ పీక్ వీడియో..!
లాక్ డౌన్ వల్ల హీరోలందరూ ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఎవరి ఇంట్లో వారికి పర్సనల్ జిమ్స్ ఏర్పాటు చేసుకొని ఇక ఇంట్లోనే ఉంటూ కసరత్తులు చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు కూడా తన ఇంట్లో ఓ విశాలమైన జిమ్ ఏర్పాటు చేసుకున్న చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జిమ్‌కు సంబంధించిన వీడియోను మహేష్ సతీమణి నమత్ర సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక మహేష్ జిమ్ ను చూస్తూనే ఎంతో అత్యాధునిక పరికరాలు, మరెన్నో హంగులతో కూడిన జిమ్‌ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక మీరు కూడా ఆ జిమ్ ను ఒకసారి చూడండి.
లాక్ డౌన్ ఎన్నో విషయాలు నేర్పుతుంది..!
ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్. ఇక ఈ సినిమా వెంకటేష్, చైతన్య 'వెంకీమామ' రవితేజ 'డిస్కోరాజా' చిత్రాలు కూడా గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ లేకపోవడంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తుంది. అయితే ఈ లాక్ డౌన్ టైములో ఎన్నో విషయాలు నేర్చుకున్నా అంటుంది పాయల్ రాజ్ పుత్.
ఢిల్లీ టు హైదరాబాద్
పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. రకుల్ నటించిన "దే దే ప్యార్ దే ", "మర్జావాన్ " హిందీ మూవీస్ ఘనవిజయం సాధించడంతో హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. రకుల్ ప్రస్తుతం "ఎటాక్ ", "ఛలే ఛలో " హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. తమిళ భాషలో "ఇండియన్ 2", అయిలాన్ ", తెలుగు లో నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు.