నెటిజెన్ కు అవార్డ్ పంపిస్తా అంటున్న మెగా డాటర్..!

Mega Daughter Niharika Konidela Gives A Fun Counter To A Netizen Question On Social Media

మెగా డాటర్ నిహారిక కాస్త చమత్కారంగానే సమాధానం చెప్తుందని ఇంతకుముందు పలు సందర్భాల్లో చూసాం. ఇక ఈసారి మరోసారి నెటిజెన్ కు కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో నిహారిక యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు అడిగిన పలు సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ నెటిజెన్ `మీ ఫేస్ మీద పింపుల్ చూశా` అని స్పందించిన నిహారిక.. `కంగ్రాట్స్.. అవార్డు ఇంటికి పంపిస్తాన`ని రిప్లై ఇచ్చింది. అలాగే `మీ ఫోన్ వాల్ పేపర్ ఏంట`ని మరోకరు ప్రశ్నించగా.. కాబోయే భర్త చైతన్యతో దిగిన ఫొటోను వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తుంది నిహారిక. గతంలో ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక కొణిదెల. ఇప్పుడు తాజాగా ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది. పూర్తి స్థాయి కామెడీతో ఈ సినిమా తెరకెక్కబోతునన్నట్టు తెలుస్తుంది. పెళ్ళికి ముందే ఈ సినిమా పూర్తి చేయాలని చూస్తుంది నిహారిక.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 20 =