సమంత ఛాలెంజ్ ను పూర్తి చేసిన రష్మిక..!

Actress Rashmika Mandanna Accepts & Completes Green Challenge Given By Samantha Akkineni

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` 3 విడత ఛాలెంజ్‌లో సెలబ్రిటీస్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఛాలెంజ్ ను స్వీకరించి ఎంతో మంది ఇప్పటికే మొక్కలు నాటి.. ఆ ఛాలెంజ్ ను పలువురికి విసురుతున్నారు. ఇక తాజాగా ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన రష్మిక తన ఛాలెంజ్ ను పూర్తి చేసింది. అక్కినేని నాగార్జున ఛాలెంజ్ ను స్వీకరించిన సమంత.. తను ఆ ఛాలెంజ్ ను పూర్తిచేసి రష్మికకు కూడా నామినేట్ చేసింది. ఇక సమంత నుంచి ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ హీరోయిన్ రష్మిక తాజాగా తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ..ఈ ఛాలెంజ్‌కు తనను నామినేట్ చేసిన సమంతకు రష్మిక కృతజ్ఞతలు…. తన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి తమ సన్నిహితులు.. ఫ్రెండ్స్ తో కూడా మొక్కలు నటించాలని కోరింది. రాశి ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్‌లను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసింది..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా రష్మిక పాత్ర హైలైట్ అని చెపుతున్నారు. ఇక తమిళ్ లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో కూడా నటిస్తుంది. వీటితో పాటు కన్నడలో కూడా సినిమాలు చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =