పేద విద్యార్థులకు అండగా – 4 పాఠశాలలను దత్తత తీసుకున్న సుదీప్..!

Actor Kichcha Sudeepa Adopts Four Government Schools In Karnataka To Support Poor Students

హీరోలు కేవలం సినిమాలే కాదు మరోవైపు సామాజిక సేవల్లో కూడా బాగానే పాల్గొంటారు. కన్నడ హీరో సుదీప్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ కరోనా సమయంలో తన పేద విద్యార్థులకు అండగా నిలిచాడు సుదీప్. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని నాలుగు పాఠశాలలను తన ట్రస్ట్ ద్వారా దత్తత తీసుకున్నారట. అక్కడి పేద విద్యార్లులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవడమే కాదు.. డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నారట సుదీప్. ఇప్పటికే వాలంటీర్స్ ద్వారా ఆయా పాఠశాలల మెరుగు కోసం ఎలాంటి వసతులు అవసరం అనే వివరాలను సుదీప్ సేకరించినట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ గా వున్నాడు. ఫాంటోమ్‌, కిట్టీ-కోటిగొబ్బ 3, బిల్లా రంగా భాషా, థగ్స్ ఆఫ్ మాల్గుడి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =