విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా తెలుగు ఫిలిం నగర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాంది కథకు ఎలా నాంది పడింది… నగ్నంగా నటించడం వెనుక కారణాలు ఏంటో తెలియచేసాడు. మహర్షిలో నా రోల్ చూసిన తర్వాత గత ఏడాది ఆగష్టులో విజయ్ ఈ స్క్రిప్ట్ తో నా దగ్గరకు వచ్చాడు.. ఈ సినిమా నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఒక నటుడిగా నన్ను నమ్మాడు…నాకు కూడా నా పంథాను మార్చుకోడానికి ఇదే సరైన కథ అని అనిపించింది.. ఇంక స్క్రిప్ట్ కూడా నాకు నచ్చడంతో ఓకే చెప్పాను అని చెప్పాడు. ఇక ఆ తర్వాత పోలీసులు నిందులతో ఎలా ప్రవర్తిస్తారు.. ఫిజికల్ గా ఎలా భాదిస్తారు అనే పలు విషయాలు, అనేక ఆర్టికల్స్ కలెక్ట్ చేసాం. దాదాపు నాలుగు నెలలు రీసెర్చ్ చేసి డిసెంబర్ లో స్క్రిప్ట్ లాక్ చేసి జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసాం అని తెలిపాడు. అంతేకాదు నగ్నంగా నటించడంపై కూడా మాట్లాడుతూ.. గతంలో కూడా రాజశేఖర్ గారు ఇంకా కొంతమంది హీరోలు ఇలాంటి పాత్రల్లో నటించారు..అది సీన్ డిమాండ్ ను బట్టే ఉంటుంది.. అదీకాకుండా జైల్లో జరిగే ప్రొసీజర్ లో ఇది కూడా ఒకటే.. ఏదైనా వెపన్ ను తీసుకెళ్తావేమో అని సెర్చ్ చేస్తారు. ముందు డైరెక్టర్ కూడా కొంచం ఆలోచించాడు.. బాక్సర్ వేసుకోమని చెప్పాడు.. కానీ సహజత్వంగా ఉండాలని నేనే చేస్తా అని చేశా అసలు కథ చెప్పాడు.
ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: