కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 86

ట్రైలర్ & టీజర్

'డర్టీ హరి' ట్రైలర్ రిలీజ్..!

శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డ‌ర్టీ హ‌రి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో సన్నివేశాల్లో కూడా రొమాంటిక్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఈ ట్రైలర్ యూత్ ని బాగానే ఆక‌ట్టుకుంటుంది. అంతేకాదు సినిమాపై అంచనాలను కలిగిస్తుంది.

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna and Singeetam Srinivasa Rao Cult Classic Movie Aditya 369 Completes 29 Years
సినిమా వార్తలు

29 వసంతాల "ఆదిత్య 369 "

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ , మోహిని జంటగా టైమ్ మెషీన్ నేపథ్యంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ "ఆదిత్య 369 " మూవీ 1991 సంవత్సరం జులై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీ నేటితో 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన "జాణవులే " సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో బాలకృష్ణ కృష్ణ కుమార్, కృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేశారు. ఆరెండుపాత్రలలోనూ బాలకృష్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తారక్ ఈ విషయంలో సపోర్ట్ చేయండి..!

పాయల్ ఘోష్.. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ భామ. ఆ సినిమాలో హారిక పాత్రలో అలరించిన పాయల్.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లిలో మెరిసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే వుంది. అయితే ఇటీవల ఎన్టీఆర్ గురించి మాట్లాడి మళ్ళీ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఎన్టీఆర్ మంచి సినిమా కుటుంబం నుండి వచ్చారని కానీ ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడానికి ఎంతో కష్టపడ్డారని ఆమె పేర్కొంది. ఎన్టీఆర్ గతం గురించి తెలుసుకున్న…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వన్ ఇయర్ పూర్తి చేసుకొన్న "ఇస్మార్ట్ శంకర్ "

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి ) బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ "ఇస్మార్ట్ శంకర్ " 2019 సంవత్సరం జులై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , మ్యూజిక్ డైరెక్టర్ లతో పాటు సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా రామ్ జీ సినీ అవార్డ్స్ గెలుచుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాధారణ పరిస్థితుల కోసం ఎదురుచుస్తున్నా..!

ప్రస్తుతం అందరి ఆలోచనా ఒకటే.. ఈ కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు తప్పుతుంది.. ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయి అని. సామాన్య ప్రజలనుండి సెలబ్రిటీస్ వరకూ అందరూ ఇదే కోరుకుంటున్నారు. ఇక సినీ సెలబ్రిటీస్ కు అయితే ఒకింత కష్టమే అని చెప్పొచ్చు. ఎప్పుడూ షూటింగ్స్, సినిమాలు, ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా వుండే వాళ్ళకి ఇన్నిరోజులు ఒకేప్లేస్ లో ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలంటే వారికి చాలా కష్టం. ఫ్యామిలీతో కాలక్షేపం చేసిన కొద్దిరోజులు అంటే ఉండగలరు కానీ ఇలా నెలలు నెలలు ఉండాలంటే ఇబ్బందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వాళ్లు చెప్పారు.. నేను చేశాను..!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే నమ్రత మహేష్ బాబు సినిమా సంగతులు, తమ కుటుంబ విషయాలు, పిల్లలు గౌతమ్-సితార ల అల్లరి ఆటలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ లో మాత్రం నమ్రత సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ అయినా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా తన ఇన్స్టాలో మరో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో నమ్రత గౌతమ్-సితారలతో కలిసి ఆడుతున్నట్టు ఉంది. ముగ్గురూ ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. కరోనా పై అవేర్ నెస్ గురించి మాట్లాడటం నెక్స్ట్ లెవెల్ అది.. చిన్న తుమ్ముకే మా గ్యాంగ్ ఇలా మాస్క్ తో కవర్ చేసుకోమన్నారు.. వారు చెప్పినట్టే చేశా అంటూ కాస్త కామెడీ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సినిమా వార్తలు - టాలీవుడ్ వీక్లీ రౌండప్..!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే లేటెస్ట్ అప్ డేట్స్ ను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా ఒక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'డర్టీ హరి' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

సీనియర్ నిర్మాత ఎంఎస్‌ రాజు దాదాపు 12ఏళ్ల తరువాత 'డర్టీ హరి' అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ను చూస్తుంటే. ఇక ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. చెప్పినట్టే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మాధవన్' టెన్త్ మార్కులు - ఆట అప్పుడే మొదలు కాలేదు..!

ఒక‌ప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న టాలెంటెడ్ నటుడు మాధ‌వ‌న్. కేవలం తమిళ్ లోనే కాదు కూడా తెలుగు, హిందీలో కూడా నటించారు తెలుగులో కూడా మాధవన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నాడు. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధ‌వ‌న్ రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా ప‌ద‌వ త‌ర‌గ‌తిలో తాను పొందిన మార్కుల వివరాల‌ని వెల్ల‌డించాడు. స‌డెన్‌గా మాధ‌వ‌న్ త‌న మార్కుల వివ‌రాల‌ని వెల్ల‌డించడానికి ఓ కార‌ణం ఉంది. మాధవన్ 10వ తరగతి ఫలితాల నేపథ్యంలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

TFN Adminవాట్సాప్
Ismart Shankar Actress Niddhi Agerwal Enjoys Her Quarantine With Her Family
సినిమా వార్తలు

నిధి అగర్వాల్ లాక్ డౌన్ టైమ్ పాస్

సక్సెస్ ఫుల్ "మున్నా మైఖేల్ " మూవీ తో బాలీవుడ్ లో సినీకెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్ "సవ్యసాచి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి "Mr మజ్ను : మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో నిధి గుర్తింపు పొంది పలు అవకాశాలను అందుకుంటున్నారు. "భూమి "మూవీ తో కోలీవుడ్ కు , "జేమ్స్ " మూవీ తో శాండల్ వుడ్ కు నిధి పరిచయం అవుతున్నారు. అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ లో నిధి కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
RRR Going To Be Another Visual Feast To Audience Says Tollywood Ace Writer Sai Madhav Burra
సినిమా వార్తలు

'RRR' పై ఎలాంటి అనుమానం అవసరంలేదు..!

రాజమౌళి లాంటి డైరెక్టర్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ప్రకటన ఎప్పుడు చేశారో అప్పటినుండి అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా?చూద్దామా? అని ఎదురుచూస్తున్నారు. ఇక ఎదురుచూపులకు తగ్గట్టే ఈ సినిమా రిలీజ్ కూడా వెనక్కి వెళ్తుంది. మరి ఇలాంటి సినిమాకు డైరెక్టర్ అంటే రాజమౌళి కాబట్టి డౌట్ లేదు. మరి ఇద్దరు స్టార్ హీరోలకు డైలాగ్స్ రాయడం అంటే కత్తిమీద సాము లాంటిదే. కాస్త అటూ ఇటూ అయితే మాత్రం ఫ్యాన్స్ చేసే రచ్చ అలా ఇలా ఉండదు. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమాకు డైలాగ్స్ రాసిన బుర్రా సాయిమాధవ్ ఈ సినిమా గురించి.. పాత్రల నిడివి గురించి పలు ఆసక్తికర విషయాలు…

TFN Adminవాట్సాప్
Vakeel Saab Movie Trailer To Release On Power Star Pawan Kalyan Birthday.
ట్రైలర్ & టీజర్

పవన్ కళ్యాణ్ బర్త్ డే కు "వకీల్ సాబ్ "టీజర్ రిలీజ్ ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ " తెలుగు రీమేక్ "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేత థామస్ , అనన్య నాగళ్ళ , అనసూయ , ప్రకాష్ రాజ్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సుధీర్ బాబు భారీ వర్కౌట్

సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో నటుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన సుధీర్ బాబు "శివ మనసులో శృతి " మూవీ తో హీరోగా మారారు. "ప్రేమ కథా చిత్రమ్ ", భలే మంచి రోజు ", "సమ్మోహనం " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "బాఘీ " మూవీ లో ప్రతినాయకుడిగా సుధీర్ బాబు బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరు తో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి "నన్నుదోచుకుందువటే"మూవీ లో సుధీర్ బాబు నటిస్తూ , నిర్మించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ పై 'హిట్' డైరెక్టర్ కామెడీ - పూరీ సర్ తొక్కేస్తున్నాడు సర్..!

శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు శైలేష్ కొలను. ఇక ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ కు సిద్ధమైంది. ఈ రీమేక్ కు కూడా శైలేష్ కొలనే దర్శకత్వం వహించనున్నాడు. హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 2021 సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్టార్ డమ్ అంతా అదృష్టమే - సమంత

సక్సెస్ ఫుల్ "ఏ మాయ చేసావె " మూవీ తో సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో జెస్సీ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. తన తొలి చిత్ర హీరో నాగచైతన్య ను వివాహం చేసుకుని సమంత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Tollywood Actor Nithiin Hits 3 Million Follower Mark On Twitter
సినిమా వార్తలు

3 మిలియన్ స్ట్రాంగ్.. నా ఫాలోవర్స్ కి పెద్ద థ్యాంక్స్..!

సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల మహేష్ బాబు, ప్రభాస్, పూజా హెగ్డే, విజయదేవరకొండ మిలియన్స్ లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నితిన్ కూడా ట్విటర్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ లో టాలీవుడ్ చిత్రాల హవా

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ "పోకిరి " మూవీ హిందీ లో సల్మాన్ ఖాన్ హీరోగా "వాంటెడ్ " మూవీ గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. మాస్ మహారాజా రవి తేజ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ "విక్రమార్కుడు " మూవీ హిందీ లో అక్షయ్ కుమార్ హీరోగా "రౌడీ రాథోడ్ " మూవీ గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన "అర్జునరెడ్డి "మూవీ షాహిద్ కపూర్ హీరో గా "కబీర్ సింగ్ " గా రీమేక్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటినుండీ బాలీవుడ్ నిర్మాతలు తెలుగు మూవీస్ ను హిందీ లో రీమేక్ చేయడానికి…

Team TFNవాట్సాప్
Actress Tamannaah Bhatia To Once Again Play Cameo Role In Acharya Movie After Syeraa Narasimha Reddy
సినిమా వార్తలు

'ఆచార్య' లో అతిథి పాత్రలో..?

టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలోని పాటలపై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో అతిథి పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. ఓ చిన్న పాత్రలో తమన్నా నటించనుందట... అంతేకాదు ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇందుకు త‌మ‌న్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ ఐటమ్ సాంగ్ కోసం మరోనటి రెజీనాను తీసుకున్న సంగతి తెలిసిందే…

TFN Adminవాట్సాప్
Actress Keerthy Suresh To Pair Up With Gopichand In Teja Upcoming Movie Alamelu Manga Venkata Ramana
సినిమా వార్తలు

హీరో గోపీచంద్ కు జోడీగా మహానటి ?

సక్సెస్ ఫుల్ "చిత్రం " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సినిమాటోగ్రాఫర్ తేజ దర్శకత్వంలో రూపొందిన "నువ్వు నేను ", "జయం ", "నిజం ", "నేనే రాజు నేనేమంత్రి " మూవీస్ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా "అలిమేలు మంగ వెంకట రమణ " మూవీ తెరకెక్కనుంది. తేజ దర్శకత్వంలో రూపొందిన "జయం ", "నిజం " మూవీస్ లో గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తేజ మూవీ లో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Varun Sandesh's Throwback Picture Goes Viral
సినిమా వార్తలు

'అప్పట్లో ఒకడుండేవాడు' అంటూ తనపై వరుణ్ కామెడీ.. ..!

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్టు కొట్టి ఆ తర్వాత వరుస అవకాశాలను సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి వరుణ్ కు పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. ఇక 2015లో వచ్చిన లవకుశ సినిమాలో చివరగా కనిపించాడు వరుణ్. కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తుండటంతో వరుణ్ కు కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అలా సినిమాలకు దాదాపు చాలా ఏళ్ళు దూరంగానే ఉన్నాడు. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తన వైఫ్ వితికతో కలిసి బిగ్ బాస్ 3 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చివరివరకు ఉండి, నాలుగో స్థానంలో నిలిచి హౌస్ నుండి బయటకు వచ్చేసాడువరుణ్..

TFN Adminవాట్సాప్

షేర్