కార్తికేయ, ఇషా లతో కరోనా పై ‘చిరు’ వీడియో..!

Mega Star Chiranjeevi Sends Out A Thought Provoking Video Message About Wearing Masks Along With Kartikeya Gummakonda and Eesha Rebba

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలకు పలు సూచనలు జాగ్రత్తలు ఇస్తూ ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ వీడియోలు మెసేజ్ లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మెగా స్టార్ చిరు అయితే దీనికి సంబంధించి ఎన్నో వీడియోలు పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈసారి యువ నటీనటులను కూడా తన వీడియోలో వాడుతూ మరోసారి కరోనా గురించి తనదైన శైలిలో వివరించే ప్రయత్నం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ ఈ నెల 13న ఓ విషయాన్ని తెలిపారని.. కరోనా విపత్కర పరిస్థితులు మరింత పెరిగిపోతాయని చెప్పారు.. దీన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కరోనా సంక్రమణకు ముగింపు పలకాలని చెప్పారని చిరు తెలిపారు. అంతేకాదు కార్తికేయ, ఇషా రెబ్బాతో కలిసి వీడియో కూడా చేశారు. ‘మీసాలు మెలేయడం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం వీరుడి లక్షణం’ అని పేర్కొంటూ కార్తికేయతో కలిసి ఆయన చేసిన ఈ వీడియో మంచి సందేశాత్మకంగా ఉంది. ఇక నవ్వు ముఖానికి అందమే.. అది కలకాలం ఉండాలంటే మాస్క్ తప్పనిసరి అంటూ ఇషా తో కలిసి వీడియో చేసారు.

ఇక ఇందుకు సపోర్ట్ ఇచ్చినందుకు గాను కార్తికేయ, ఇషా రెబ్బా కు థ్యాంక్స్ కూడా చెప్పారు. ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన మీకు నా ధన్యవాదాలు. సొసైటీ పై మీకున్న కమిట్మెంట్ కు అప్రిషియేట్ చేస్తున్నా అని తెలిపాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here