మహేష్ ‘జిమ్’ స్నీక్ పీక్ వీడియో..!

Namrata Shirodkar Shares Video Sneek Peek Of Mahesh Babu Lavish Home Gym

లాక్ డౌన్ వల్ల హీరోలందరూ ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఎవరి ఇంట్లో వారికి పర్సనల్‌ జిమ్స్‌ ఏర్పాటు చేసుకొని ఇక ఇంట్లోనే ఉంటూ కసరత్తులు చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు కూడా తన ఇంట్లో ఓ విశాలమైన జిమ్‌ ఏర్పాటు చేసుకున్న చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జిమ్‌కు సంబంధించిన వీడియోను మహేష్‌ సతీమణి నమత్ర సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇక మహేష్ జిమ్ ను చూస్తూనే ఎంతో అత్యాధునిక పరికరాలు, మరెన్నో హంగులతో కూడిన జిమ్‌ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక మీరు కూడా ఆ జిమ్ ను ఒకసారి చూడండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

Never too tired for the gym 💪 Hustle hard 🔥 #feelitreelit #feelthethunder #homegym

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

ఇక తన ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎప్పుడూ తెలియచేస్తూనే ఉంటుంది నమ్రత. ఇక ఈ లాక్ డౌన్ లో మహేష్ తన పిల్లలతో గడిపే స్వీట్ మూమెంట్స్ ను, గౌతమ్‌, సితారల అల్లరి, వారి ఫొటోలు నమత్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − seven =