ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 88
పాన్ ఇండియా మూవీస్ లో అలియా భట్ ?
అది వైరస్ కంటే ప్రమాదకరం..!
మహేష్ బాబు న్యూ లుక్
బాలీవుడ్ లో రీమేక్ "HIT "
కె.జి.యఫ్2 అంతకు మించి అంటున్న 'రాఖీ భాయ్'..!
'బాలీవుడ్' కి వెళ్లనున్న 'మత్తు వదలరా'..?
'యష్' తనయుడు 'ఆయుష్' సూపర్ జోష్ డ్యాన్స్..!
అమీ జాక్సన్ రీఎంట్రీ

1950 ల నేపథ్యంలో వేణు ఊడుగుల మూవీ
అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్ డేట్
లాక్ డౌన్ లో బిజీ గా నందిత శ్వేత
హీరో కార్తికేయ కోలీవుడ్ ఎంట్రీ ?
హీరోయిన్ గా మారుతున్న చైల్డ్ ఆర్టిస్ట్ ?
పలు మలయాళ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనిఖ సురేంద్రన్ ఆంథాలజీ మూవీ "5సుందరికల్ " మలయాళ మూవీ లోని ఒక కథ "సేతులక్ష్మి " లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ "ఎన్నై అరిందాల్ ", విశ్వాసం " మూవీస్ లో అజిత్ కూతురుగా అనిఖ నటించారు.
పాన్ ఇండియా మూవీస్ లో అలియా భట్ ?
బ్లాక్ బస్టర్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ " మూవీ తో హీరోయిన్ గా అలియా భట్ బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించారు . అలియా భట్ నటించిన "హై వే ", "2స్టేట్స్ ", హంప్టీ శర్మ కి దుల్హనియా ", "ఉడ్తా పంజాబ్", "రాజి ", గల్లీ బాయ్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. "ఉడ్తా పంజాబ్", "రాజి ", గల్లీ బాయ్ " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా అలియా ఆవార్డ్స్ అందుకున్నారు. ప్రస్తుతం 3 హిందీ మూవీస్ లో నటిస్తున్న స్టార్ హీరోయిన్ అలియా "RRR" మూవీ లో కథానాయిక గా ఎంపిక అయిన విషయం తెలిసిందే.
'ఇండియన్ 2' పై రకుల్ - అలాంటి వారు ఉంటే ఎంతో నేర్చుకోవచ్చు..!
ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా పలు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది తెలుగులో మన్మధుడు2, హిందీలో 'దే దే ప్యార్ దే' సినిమా తో సందడి చేయగా.. ఈ ఏడాది ఒక అరడజను సినిమాలను లైన్ లో పెట్టింది. అందులో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి.

"వేట్టైయాడు విలైయాడు "(రాఘవన్ ) సీక్వెల్ లో కీర్తి సురేష్ ?
సెవెంత్ ఛానల్ కమ్యూనికేషన్స్ బ్యానర్ పై గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందిందిన యాక్షన్ థ్రిల్లర్ "వేట్టైయాడు విలైయాడు " తమిళ మూవీ 2006 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో కమల్ హాసన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. "వేట్టైయాడు విలైయాడు " మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "రాఘవన్ " మూవీ కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ కి సీక్వెల్ రూపొందనుంది.
అది వైరస్ కంటే ప్రమాదకరం..!
కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇస్తూనే వున్నాయి. ఇక ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ కూడా ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని.. సోషల్ డిస్టన్స్ మెయిన్ టైన్ చేయాలని.. చెబుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే లాక్డౌన్లో సడలింపులు చేశారో కరోనా భీభత్సంగా వ్యాపించడం మొదలైంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో భారత్ 3వ స్థానంలో ఉందంటే ఏ రేంజ్లో కరోనా ఉదృతి ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రజల నిర్లక్ష్య ధోరణి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తాజాగా ఇదే విషయంపై దర్శకుడు కొరటాల శివ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ట్వీట్ చేశారు.
మహేష్ బాబు న్యూ లుక్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో మహేష్ బాబు సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు కరోనా టైమ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ఏదైనా మంచిపని జరిగితే అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మహేష్ బాబు ట్విట్టర్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. మహేష్ బాబు ఇప్పుడు సోషల్ మీడియా లో తన డిస్ ప్లే , ప్రొఫైల్ పిక్చర్స్ ను మార్చారు.
బాలీవుడ్ లో రీమేక్ "HIT "
హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై నూతన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ "ఫలక్ నుమా దాస్ " మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "HIT " మూవీ ఘనవిజయం సాధించింది. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు "HIT " మూవీ హిందీ లో రీమేక్ కానుంది.
కె.జి.యఫ్2 అంతకు మించి అంటున్న 'రాఖీ భాయ్'..!
ఫుల్ మాస్ కమెర్షియల్ మూవీ కె.జి.యఫ్ హిట్ తర్వాత ఈ సినిమా సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాదు మన తెలుగు రాష్ట్రాలు.. ఇంకా హిందీలో కూడా ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రాఖీ భాయ్ గా యష్ చేసిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతంచేసుకున్నాడు యష్.
'బాలీవుడ్' కి వెళ్లనున్న 'మత్తు వదలరా'..?
పెద్ద సినిమా, చిన్న సినిమా అని చూసే రోజులు పోయాయి. కథలో కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే. ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చి అలా కోట్లు కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఎన్నో చూసాం. ఇక మన తెలుగు హిట్ సినిమాలను కూడా బాలీవుడ్ అక్కడ రీమేక్ చేసుకొని సొమ్ములు చేసుకుంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీమేక్ చేశాయి.. కొన్ని లైన్ లో ఉన్నాయి.. ఇక ఇప్పుడు తాజాగా మరో సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ వచ్చిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ 'మత్తు వదలరా' సినిమాను ఇప్పుడు బాలీవుడ్ రీమేక్ చేయాలని చూస్తున్నారు.
ఈ ప్రపంచం ఎంత చిన్నది - నాని సిస్టర్ ను చేసుకున్న నా చిన్ననాటి ఫ్రెండ్..!
లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు కూడా ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా వుంటూ అప్పుడు తన ఫిట్ నెస్ కు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేస్తున్నాడు. ఇక ఇటీవలే నేషనల్ స్కూల్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ లో రన్నర్ అప్ గా మెడల్ తీసుకుంటున్న ఫోటోను సుధీర్ బాబు తన ఇన్‌స్టా గ్రామ్ లో షేర్ చేసి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి ఫొటోనే ఒకటి షేర్ చేసాడు. తన చిన్ననాటి ఫొటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ... ఈ ఫొటోలో వున్నది నా చిన్నప్పటి ఫ్రెండ్ రాము.. ఇప్పుడు నాని సిస్టర్ ను పెళ్లి…
'యష్' తనయుడు 'ఆయుష్' సూపర్ జోష్ డ్యాన్స్..!
కన్నడ స్టార్ హీరో యష్ తన పిల్లల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు. అక్టోబర్ 30, 2019న వీరికి ఆయుష్ జన్మించగా, మే 1న తొలిసారి కుమారుడి ఫోటోని షేర్ చేశాడు యష్. అప్పటినుండి కుమారుడికి సంబంధించిన ఫోటోలు తరచూ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో తనయుడు ఆయుష్ కి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ వీడియో ఏంటంటే..ఆయుష్ టాయ్ కారులో మ్యూజిక్ కి జోష్‌తో డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక ఆ వీడియోను తీసి యష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటంది.
కాఫీతో 'మిస్ ఇండియా' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్..!
మహానటి' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది. అందులో మిస్ ఇండియా సినిమా కూడా ఒకటి. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అందులో భాగంగా ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. తన…
స్టార్ హీరో సూర్య డిజిటల్ ఎంట్రీ
ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన "నేరుక్కునేర్ " మూవీ తో సూర్య సినీకెరీర్ ప్రారంభించారు. సూర్య హీరోగా నటించిన "మౌనం పేసియదే", "పితా మగన్ ", "గజిని " , "వారనమ్ ఆయిరమ్ ", సింగం సిరీస్ , "24 ", "కాప్పాన్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. "పితా మగన్ " మూవీ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న సూర్య "వారనమ్ ఆయిరమ్ ", "పేరళగన్", "24 " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సూర్య "రక్తచరిత్ర 2 " తెలుగు మూవీ లో నటించారు.
అమీ జాక్సన్ రీఎంట్రీ
సక్సెస్ ఫుల్ రొమాంటిక్ పీరియడ్ యాక్షన్ మూవీ "మదరాసపట్టినం " మూవీ తో మిస్ టీన్ వరల్డ్ 2009 అమీ జాక్సన్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు తమిళ , హిందీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అమీ జాక్సన్ సూపర్ హిట్ "ఎవడు " మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అమీ జాక్సన్ నటించిన "సింగ్ ఈజ్ బ్లింగ్ "(హిందీ ), "తెరి "(తమిళ ) , తమిళ , హిందీ భాషలలో రూపొందిన "2 .0"మూవీస్ ఘనవిజయం సాధించాయి.
బ్యాక్ టు వర్క్ అంటున్న 'కరణం మల్లీశ్వరి' డైరెక్టర్..!
‘రాజుగాడు’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు సంజనా రెడ్డి... ఇప్పుడు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆమె అస్వస్థతకు గురైన సంగతి కూడా విదితమే. హై ఫీవర్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దానితో పలు రూమర్లు కూడా రాగా వాటికి చిత్ర యూనిట్ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో ఆమె తిరిగి వర్క్ చేయడానికి రెడీ అయినట్టు తెలుపుతున్నారు. అనారోగ్యంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను.. ఇప్పుడు ఫిట్ అయ్యాను.. ఇంకా బయోపిక్ వర్క్ స్టార్ట్ చేయాలి.. అని తెలిపింది. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ చాలా సంతోషంగా ఉంది…

1950 ల నేపథ్యంలో వేణు ఊడుగుల మూవీ
సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన వేణు ఊడుగుల నిజ జీవిత సంఘటనలతో ఆ మూవీ ని రూపొందిందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు వేణు ఇప్పుడు 1990 ల కాలం నాటి సామజిక సంఘటనల నేపథ్యంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా "విరాటపర్వం " మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే ఈ మూవీ పై హైప్ క్రియేట్ అయింది. "విరాటపర్వం " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్ డేట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో రష్మిక కథానాయిక. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్న "పుష్ప " మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా "పుష్ప " మూవీ షూటింగ్ నిలిచిపోయింది .
క్రేజీ కాంబినేషన్ లో కన్నడ బ్లాక్ బస్టర్ ‘లవ్ మాక్ టైల్’ రీమేక్..!
సినీ పరిశ్రమలో రీమేక్ లు చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలు మన భాషల్లో రీమేక్ చేసుకోవడం... మన హిట్ సినిమాలు పక్కన పరిశ్రమ వాళ్లు రీమేక్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ లుగా నిలిచిన నాలుగైదు సినిమాలు రీమేక్ అవుతున్నాయి.. ఇప్పుడు కన్నడలో సూపర్ హిట్ అయిన మరో సినిమా తెలుగులో రీమేక్ కు సిద్ధమైంది. ఆ సూపర్ హిట్ సినిమా ఏదో కాదు 'లవ్ మాక్ టైల్'.
లాక్ డౌన్ లో బిజీ గా నందిత శ్వేత
"నందా లవ్స్ నందిత " కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నందిత శ్వేత సక్సెస్ ఫుల్ "అట్టకత్తి " మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. సూపర్ హిట్ "ఎక్కడికి పోతావు చిన్నవాడా" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న నందిత బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. పలు తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నందిత ప్రస్తుతం రెండు తెలుగు , ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు.
హీరో కార్తికేయ కోలీవుడ్ ఎంట్రీ ?
బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా కొనసాగుతున్న తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హూమా ఖురేషి కథానాయిక కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ లో ప్రతినాయకుడిగా హీరో కార్తికేయ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కరోనా కారణం గా "వాలిమై " మూవీ షూటింగ్ వాయిదా పడింది.