త్వరలో రానున్న ఎంఎస్‌ రాజు మూవీ ‘డర్టీ హరి’ ట్రైలర్..!

Tollywood Producer MS Raju Dirty Hari Movie Trailer To Release Soon

ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సీనియర్ నిర్మాత ఎంఎస్‌ రాజు దాదాపు 12ఏళ్ల తరువాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్‌ రాజు తాజాగా ‘డర్టీ హరి’ అనే సినిమాతో వస్తున్నారు. ఇక తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ను చూస్తుంటే. ఇక ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్టు చెపుతున్నారు నిర్మాతలు.

ఈ సందర్భంగా నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ “మా `డర్టీ హరి` నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్త‌య్యాయి. రెండు నెల‌ల లాక్‌డౌన్ త‌ర్వాత ఇప్పుడు… విడుదలకి సిద్దంగా ఉంది. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాం .త్వరలో మా చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నాం“ అని అన్నారు

కాగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో వెండి తెరకు పరిచయం అవుతున్నాడు శ్రవణ్ రెడ్డి. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకం పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు ఎంఎస్ రాజు రాయ‌డం విశేషం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here