నాన్నతో ఆ మూమెంట్ ను ఎప్పుడూ మరిచిపోలేను..!

Tollywood Actor Allari Naresh Reveals A Special Memory With His Father EVV Satyanarayana

విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాను త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.

ఇక ఈ సందర్భంగా తెలుగు ఫిలిం నగర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అల్లరి నరేష్ తన నాన్న ఈవీవీ సత్యనారాయణ గారితో గడిపిన బెస్ట్ మూమెంట్ ను పంచుకున్నాడు. నా 16వ బర్త్ డే నాకు చాలా స్పెషల్.. మానాన్న గారు షూటింగ్ లంటూ బిజీ గా వుండే వారు.. హైద్రాబాద్, వైజాగ్, రాజమండ్రి ఇలా షూటింగ్స్ తో తిరుగుతూనే ఉండేవాళ్ళు.. అందుకే నా చిన్నప్పటి నుండి నా పుట్టినరోజు ఎప్పుడు నాకు స్పెషల్ గా అనిపించేది కాదు.. అయితే ఒకరోజు అదిరింది అల్లుడు సినిమా షూటింగ్ కోసం 45 రోజులపాటు అబ్రాడ్ ప్లాన్ చేశారు.. అప్పుడు నన్ను కూడా వెళ్లారు.. ఇక అక్కడికి వెళ్లేసరికి నాన్న కేక్ తో, సెలెబ్రేషన్స్ తో సర్ ప్రయిజ్ చేశారు అది ఎప్పటికీ మరిచిపోలేను అని చెప్పాడు.

ఇక తన తండ్రి డైరెక్షన్ లో నరేష్ అల్లరి సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. అప్పట్లోనే తక్కువ బడ్జెట్ తో తీయగా కోట్లలో కలెక్షన్స్ రాబట్టింది వరుస ప్లాప్స్ లో ఉన్న నరేష్ కు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here