లాక్ డౌన్ పై సోను సూద్ బుక్

Bollywood Actor Sonu Sood Plans To Publish A Book To Share His Lockdown Experiences

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ప్రజలు పలు ఇబ్బందులకు గురి అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ బాధితులకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా అనేక రకాలుగా సహాయం అందించారు. మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసిన విషయం తెలిసిందే. రీల్ విలన్ సోను సూద్ వలస కార్మికులకు సహాయం అందిస్తూ రియల్ హీరోగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో సోను సూద్ తన హోటల్ లో డాక్టర్స్ , పారా మెడికల్ సిబ్బంది నివాసానికి ఏర్పాటు చేశారు. వలస కార్మికులను వారి స్వంత రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు వేలాది మంది కార్మికులకు ఆహార సదుపాయం కలిపించి , వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదిస్తూ , అనుమతులు తీసుకొని బస్సులు ఏర్పాటు చేసి వారిని గమ్య స్థానాలకు చేర్చారు. పలు విధాలుగా లాక్ డౌన్ బాధితులకు సహాయ పడిన సోను సూద్ , తన అనుభవాలతో ఒక పుస్తకం రాస్తానని ప్రకటించారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ తన బుక్ ను ప్రచురించేందుకు ముందుకు వచ్చిందని , తాను చూసిన వాస్తవ సంఘటనలను పుస్తక రూపంలో శాశ్వతం గా నిలిచిపోయేలా చేయాలని తన అభిప్రాయమని సోను సూద్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 3 =