మన సినిమాలో చేసే పాత్రలు మనలోనే ఉంటాయి అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా ఇలా ప్రతి సినిమాలోనూ తనను కొత్తగా ఆవిష్కరించుకుంటూ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతమంది యంగ్ హీరోలు ఎన్నో ఏళ్ళనుండి టాలీవుడ్ లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. కానీ విజయ్ మాత్రం చాలా తక్కువ టైంలోనే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీరు చేసిన సినిమాల్లో మీ క్యారెక్టర్ కు దగ్గరగా వుండే పాత్ర ఏదైనా ఉందా అని ఓ ఇంటర్వ్యూలో అడగగా దానికి విజయ్… నేను చేసిన ప్రతి క్యారెక్టర్ నాలో వున్నదే… మిడిల్ స్కూల్ లో వున్నప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో పాత్ర మాదిరిగానే ఉండేవాడిని..పెళ్లిచూపులు, అర్జునరెడ్డి లో ఉన్న పాత్రలు కూడా నాలో ఉన్నవే…మనందరిలో అన్ని ఫీలింగ్స్ ఉంటాయి.. ప్రతి ఒక్కరిలోనూ అభద్రతాభావం, సిగ్గు, బహిర్ముఖంగా మాట్లాడేతత్వం ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి…అవే స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేస్తాయని తెలిపాడు. నేను కూడా కెరీర్ మొదట్లో అందరిలాగే ఇతరుల అభిప్రాయాలను పట్టించుకునేవాడిని.. అయితే మా నాన్నగారు ఒకరోజు నాకోవిషయం చెప్పారు.. ఈ ఎమోషన్స్ అన్నీ నీలో ఉన్నవే.. నీకు వేరేవాళ్ల అభిప్రాయంతో పనిలేదు.. నువ్వు మంచిగా చేస్తున్నావని ఈ ప్రపంచం నమ్ముతుంది అది నువ్వు తెలుసుకోవాలని చెప్పారని విజయ్ చెప్పాడు. మరి అందుకేనేమో విజయ్ ఏపాత్ర చేసినా అంత న్యాచురల్ గా ఉంటుంది.
కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: