మూవీ ఫీచర్ : దాన వీర శూర కర్ణ

Todays Movie Featured Article : Daana Veera Soora Karna

రామ కృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై నందమూరి తారక రామారావు నటించి , నిర్మించి, దర్శకత్వం వహించిన హిందు మైథలాజికల్ ఫిల్మ్ “దాన వీర శూరకర్ణ ” 1977 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 10 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 2 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “దాన వీర శూరకర్ణ ” మూవీ లో కర్ణ , దుర్యోధన, కృష్ణుడు గా ఎన్టీఆర్ నటించగా ఆయన తనయులు హరికృష్ణ అర్జునుడు , బాలకృష్ణ అభిమన్యుడు గా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“దాన వీర శూరకర్ణ ” మూవీ 9 సెంటర్స్ లో శతదినోత్సవం , హైదరాబాద్ లో 250 రోజులు ప్రదర్శించబడింది. ఈ మూవీ ఫస్ట్ రన్ లో కోటి రూపాయలు కలెక్ట్ చేయగా , రిపీట్ రన్ లో మరో కోటి రూపాయలు కలెక్ట్ చేయడం విశేషం. “దాన వీర శూరకర్ణ ” మూవీ 4 గంటల 17 నిముషాలు లెంగ్త్ ఉండగా 4 గంటల పాటు ఎన్టీఆర్ స్క్రీన్ పై కనిపించడం రికార్డ్. ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ “లవకుశ ” ఒక కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. సినిమా టికెట్ రేట్ 1 రూపాయి ఉండగా “దాన వీర శూరకర్ణ ” మూవీ 2 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి టికెట్ రేట్స్ తో పోల్చుకుంటే సుమారు 500 కోట్లకు సమానమవుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =