ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 74

'సూపర్ స్టార్' బిరుదుకు అసలైన నిర్వచనం మహేష్
పెట్ డాగ్స్ తో రవితేజ
పర్మినెంట్ లాక్ డౌన్ రానా అంటున్న అక్షయ్..!
యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న విక్రమ్..!
ఏం జరిగినా మన మంచికే -పూజాహెగ్డే
బ్లాక్ &వైట్ ఫొటో లో ప్రగ్య జైస్వాల్
మళ్ళీ రైటర్ గా పవన్ కళ్యాణ్ ?
ప్లాస్మా డొనేషన్ పై మహేష్ పిలుపు
పెళ్ళి సందడి
అక్కా చెల్లెళ్ళు గా సమంత , రష్మిక ?
ప్లాస్మా డొనేషన్ కై చిరంజీవి పిలుపు
ప్రశాంత్ వర్మ కరోనా సినిమా టైటిల్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ కు కూడా కరోనా పాజిటివ్
టాలీవుడ్ న్యూస్ వీక్లీ రౌండప్
నాగ్ 'వైల్డ్ డాగ్' టీజర్ అప్పుడేనా..?
'కె.జి.యఫ్' కు 'బాహుబలి' సినిమానే స్పూర్తి..!

ఎకో ఫ్రెండ్లీ గణపతి ని పూజిద్దాం - శ్రద్ధాకపూర్
కృష్ణుడికి సపోర్ట్ గా ప్రభాస్..!
'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ రిలీజ్
తన పుట్టిన రోజు వేడుకలు చేయొద్దని ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచినా తన కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను కుష్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్‌తో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.

'సూపర్ స్టార్' బిరుదుకు అసలైన నిర్వచనం మహేష్
హీరో అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిందే. అలాంటిది సూపర్ స్టార్ అంటే ఇంకెన్ని క్వాలిటీస్ ఉండాలి. ఊరికే సూపర్ స్టార్ లు అయిపోరు కదా. ఇక ఈ సూపర్ స్టార్ బిరుదుకు అసలైన నిర్వచనం మహేష్ అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. నటన మాత్రమే కాదు స్టైల్, అందం అన్నిటికి మించి పర్సనల్ బిహేవియర్ ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నాడు. తన అందంతో మొదట ప్రిన్స్ మహేష్ అనిపించుకున్న మహేష్ ఆ తర్వాత తన విజయాలతో సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక బిరుదు రాకముందు కంటే వచ్చిన తర్వాతే అసలైన అగ్నిపరీక్ష మొదలవుతుంది. కానీ మహేష్ మాత్రం తన సినిమాలతో, పనులతో సూపర్ స్టార్…
పెట్ డాగ్స్ తో రవితేజ
లాక్ డౌన్ లో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికే వారు రోజూ చేసే పనులు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూనే ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది తమ పెట్ డాగ్స్ తో సరదాగా ఆడుకుంటూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మాస్ మహారాజ్ కూడా తన పెట్ డాగ్స్ కు సంబంధించి ఒక ఫొటోను పోస్ట్ చేసాడు. తన డాగ్స్ ను ప్రేమతో తలపై నిమురుతూ.. దానికి మై బాయ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
పర్మినెంట్ లాక్ డౌన్ రానా అంటున్న అక్షయ్..!
మరికొద్ది గంటల్లో రానా-మిహికా వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఎక్కడ చూసినా వీరిద్దరి హల్దీ ఫంక్షన్.. పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ ఫొటోల్లో రానా-మిహికా ను చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉన్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ. ఈ రాత్రి 8:30 గంటలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వివాహం జరుపనున్నారు. ఇక వివాహానికి కూడా అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడం జరిగింది.
యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న విక్రమ్..!
యంగ్ హీరోలందరూ వర్కౌట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ తో అభిమానులను అలరిస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ తమ లుక్స్ ను మార్చేసుకుంటున్నారు. యంగ్ హీరోల సంగతి ఓకే.. మరి సీనియర్ హీరోల సంగతేంటి. మేము కూడా వారికి ఏమాత్రం తక్కువ కాదంటున్నారు. మరి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విక్రమ్ ఫొటో చూస్తే ఎవరైనా ఆ మాట అనక తప్పదు. బ్లాక్ అండ్ వైట్ లో సిక్స్ ప్యాక్ లో ఉన్న విక్రమ్ ఫొటో చూస్తే ఈయన వయసు పెరుగుతుందా? లేక రోజు రోజుకు తగ్గుతుందా అన్న డౌట్ రాక మానదు. విక్రమ్ వయసు ఇప్పుడు 54 ఏళ్లు. కొడుకు ధృవ్ కూడా సినిమాల్లోకి వచ్చాడు. మొదటి సినిమాతో మంచి హిట్ కూడా కొట్టాడు. అలాంటి విక్రమ్ ఇప్పుడు ఈ వయసులో లుక్…
ఏం జరిగినా మన మంచికే -పూజాహెగ్డే
బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా ఒక మూవీ , అక్షయ్ కుమార్ హీరో గా మరొక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయం లో పూజాహెగ్డే తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , వర్కౌట్స్ , యోగా , కుకింగ్ వంటి వాటితో పాటు సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
బ్లాక్ &వైట్ ఫొటో లో ప్రగ్య జైస్వాల్
తెలుగు , తమిళ భాషలలో రూపొందిన "విరాట్టు "(తెలుగు డేగ ) మూవీ తో టాలీవుడ్ , కోలీవుడ్ లకు ప్రగ్య జైస్వాల్ పరిచయం అయ్యారు. "టి టూ ఎంబిఏ " మూవీ తో బాలీవుడ్ లో ప్రగ్య ప్రవేశించారు. "కంచె ", "ఓం నమో వెంకటేశాయ ", "గుంటూరోడు "," జయ జానకి నాయక ", "ఆచారి అమెరికా యాత్ర " వంటి మూవీస్ తో ప్రేక్షకులను ప్రగ్య అలరించారు.
మళ్ళీ రైటర్ గా పవన్ కళ్యాణ్ ?
మల్టీ ట్యాలెంటెడ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తోనే కాకుండా చిత్ర పరిశ్రమలో పలు విభాగాలలో తన ప్రతిభను కనపరిచారు . "జానీ "మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే సమకూర్చి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. "సర్దార్ గబ్బర్ సింగ్ " మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ అందించారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన "డాడీ " మూవీ లో ఒక ఫైట్ సీన్ ను పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారు . "అత్తారింటికి దారేది ", "అజ్ఞాతవాసి " మూవీస్ కు పవన్ కళ్యాణ్ గాయకుడు గా మారారు. "జనసేన "పొలిటికల్ పార్టీ స్థాపించి సినిమాలకు దూరం అయ్యారు.
ప్లాస్మా డొనేషన్ పై మహేష్ పిలుపు
కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మద్దతు పలుకుతూ వారు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన చేపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీస్ ఇప్పటికే స్పందించి ప్లాస్మా డొనేషన్ చేయాలని కోరారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా ప్లాస్మా డొనేషన్ పై పిలుపనిచ్చారు.
పెళ్ళి సందడి
టాలీవుడ్ హీరోలు నితిన్ , అఖిల్ ఒక ఇంటివారయిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో రానా వంతు వచ్చింది. హీరో రానా , మిహికా బజాజ్ వివాహం ఈ రోజు జరుగనున్న విషయం తెలిసిందే. ముందుగా రానా వివాహాన్ని ఒక ప్యాలెస్ లో గ్రాండ్ గా జరపాలని రానా ఫాదర్ సురేష్ బాబు ప్లాన్ చేశారు. కరోనా కారణం గా లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి రామానాయుడు స్టూడియో లో రానా , మిహికా వివాహం జరగనుంది. ఈ వివాహానికి 30 మంది మాత్రమే హాజరుకానున్నారని సమాచారం.
డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్న స్టైలిస్ట్ నీరజ కోన ..!
ఈ మధ్య ఇండస్ట్రీలో కొత్త కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డైరెక్టర్స్ అంటే డైరెక్షన్.. హీరోలంటే నటన.. నిర్మాతలంటే కేవలం నిర్మాణం మాత్రమే చెయ్యట్లేదు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మధ్య హీరోలు డైరెక్టర్స్ కూడా నిర్మాతలవుతున్నారు. కొంతమంది హీరోలు రైటర్లు గా కూడా మారుతున్నారు. కొంత మంది డైరెక్షన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో స్టైలిస్ట్ కూడా డైరెక్షన్ వైపుఅడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ స్టైలిస్ట్ ఎవరో కాదు నీరజ కోన.
అక్కా చెల్లెళ్ళు గా సమంత , రష్మిక ?
స్టార్ హీరోయిన్ సమంత , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక అక్కా చెల్లెళ్ళు గా ఒక మూవీ లో నటిస్తున్నారని సమాచారం. ఇటీవల ఒక యువదర్శకుడు అక్కా చెల్లెళ్ళు కథ తో సమంత , రష్మిక లను సంప్రదించారని, కథ వినగానే ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , ఉమెన్ సెంట్రిక్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఇద్దరు ట్యాలెంటెడ్ హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారనే వార్త అభిమానులలో సంతోషం కలిగించింది.
ప్లాస్మా డొనేషన్ కై చిరంజీవి పిలుపు
కరోనా మహమ్మారి వ్యాధి నుండి కోలుకున్న వారి బ్లడ్ ప్లాస్మా తో మరికొంతమంది ప్రాణాలు రక్షించవచ్చనే విషయం తెలిసిందే. కరోనా నుండి కోలుకున్న వారి ప్లాస్మా దానానికై సైబరాబాద్ కమిషనరేట్ లో సి పి సజ్జనార్ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్లాస్మా దానం చేసిన కొంతమంది దాతలను సజ్జనార్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మెగా స్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
ప్రశాంత్ వర్మ కరోనా సినిమా టైటిల్ రిలీజ్
సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా 'అ' సినిమాతోనే తనలోని విభిన్నతను చూపించాడు. రెండో సినిమా కల్కి రాజశేఖర్‌తో చేసి ఆకర్షించారు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ కు కూడా కరోనా పాజిటివ్
టాలీవుడ్ సెలబ్రిటీస్ ను కరోనా వదలట్లేదు. రోజుకో సెలబ్రిటీ కరోనా బారిన పడుతున్నారు. బండ్ల గణేష్ మొదలుకుని, రాజమౌళి ఫ్యామిలీ, స్మిత, ఎస్.పి. బాలు ఇలా టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ సోకిన వారిలో ఉన్నారు. ఇక తాజాగా మరో సెలబ్రిటీకి కరోనా సోకింది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు ఆర్ఆర్ఆర్ నిర్మాత. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్యకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లుగా తెలుస్తుంది. అయితే రాజమౌళికి కరోనా రావడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ నిమిత్తం రాజమౌళిని దానయ్య కలిసుండవొచ్చు అందుకే వచ్చిందేమో అంటున్నారు.
టాలీవుడ్ న్యూస్ వీక్లీ రౌండప్
గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.
నాగ్ 'వైల్డ్ డాగ్' టీజర్ అప్పుడేనా..?
గత ఏడాది మన్మథుడు సినిమా సీక్వెల్ మన్మథుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ నాగార్జున. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది.
'కె.జి.యఫ్' కు 'బాహుబలి' సినిమానే స్పూర్తి..!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు అవి. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ఇక ఈ సినిమా ఎన్నో సినిమాలకు స్ఫూర్తి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు బాహుబలి ఒక ఇన్స్పిరేషన్. అంతేకాదు ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ కి కూడా బాహుబలినే ఇన్స్పిరేషన్ అంటున్నాడు యష్.

ఎకో ఫ్రెండ్లీ గణపతి ని పూజిద్దాం - శ్రద్ధాకపూర్
యాక్ట్రెస్ , సింగర్ శ్రద్ధాకపూర్ "తీన్ పత్తి " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఆషికి 2 ", "ఏక్ విలన్ ", "ABCD 2", "బాఘీ ", "హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ", " స్త్రీ ", "సాహూ ", "చిచ్చోరె" వంటి సూపర్ హిట్ మూవీస్ తో శ్రద్ధాకపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ మూవీ "సాహూ " తో శ్రద్ధాకపూర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శ్రద్ధాకపూర్ ప్రస్తుతం " స్ట్రీట్ డ్యాన్సర్ 3డి ", "బాఘీ 3 " మూవీస్ లో నటిస్తున్నారు.
కృష్ణుడికి సపోర్ట్ గా ప్రభాస్..!
టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ నిర్మాతలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని సినిమాలు చేయడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు అంటే వేరు... ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి కోట్లు కోట్లు లాభాలు గణించిన కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ వున్నారు. ఇప్పుడు అందరూ నిర్మాతలుగా మారడానికి కూడా ఇదో కారణమని చెప్పొచ్చు. ఎవరో సినిమా తీసి హిట్ కొట్టి సొమ్ము చేసుకోడం కంటే లాభమో నష్టమో తామే సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.