పెట్ డాగ్స్ తో రవితేజ

Mass Maharaja Ravi Teja Shares A Pic With His Pet Dogs On Social Media

లాక్ డౌన్ లో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికే వారు రోజూ చేసే పనులు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూనే ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది తమ పెట్ డాగ్స్ తో సరదాగా ఆడుకుంటూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మాస్ మహారాజ్ కూడా తన పెట్ డాగ్స్ కు సంబంధించి ఒక ఫొటోను పోస్ట్ చేసాడు. తన డాగ్స్ ను ప్రేమతో తలపై నిమురుతూ.. దానికి మై బాయ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

 

View this post on Instagram

 

My boys💥

A post shared by RAVI TEJA (@raviteja_2628) on

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో .. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా సక్సెస్ ఫుల్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దీనితో పాటు మారుతి తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

మరి రవితేజ మంచి హిట్ కొట్టి చాలా ఏళ్ళే అయింది. తమ హీరో ఎప్పుడు సూపర్ హిట్ కొడతాడా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంచనాలన్నీ ఇప్పుడు ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను మాస్ మహారాజ్ రీచ్ అవుతాడో?లేదో? చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =