నాగ్ ‘వైల్డ్ డాగ్’ టీజర్ అప్పుడేనా..?

Action Thriller Wild Dog Movie Teaser Will Be Out On Akkineni Nagarjuna Birthday

గత ఏడాది మన్మథుడు సినిమా సీక్వెల్ మన్మథుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ నాగార్జున. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా నుండి టీజర్ రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 29 నాగార్జున పుట్టిన రోజున కావడంతో ఆ రోజు టీజర్ రిలీజ్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి. ఇక సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు. 26/11 ముంబై దాడుల నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో పాటలు కానీ.. కామెడీ కానీ, హీరోయిన్ కానీ ఉండదట. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక కింగ్ నాగార్జున తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇంకా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితోపాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =