యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న విక్రమ్..!

Chiyaan Vikram Gives Stiff Competition To New Generation Heroes

యంగ్ హీరోలందరూ వర్కౌట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ తో అభిమానులను అలరిస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ తమ లుక్స్ ను మార్చేసుకుంటున్నారు. యంగ్ హీరోల సంగతి ఓకే.. మరి సీనియర్ హీరోల సంగతేంటి. మేము కూడా వారికి ఏమాత్రం తక్కువ కాదంటున్నారు. మరి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విక్రమ్ ఫొటో చూస్తే ఎవరైనా ఆ మాట అనక తప్పదు. బ్లాక్ అండ్ వైట్ లో సిక్స్ ప్యాక్ లో ఉన్న విక్రమ్ ఫొటో చూస్తే ఈయన వయసు పెరుగుతుందా? లేక రోజు రోజుకు తగ్గుతుందా అన్న డౌట్ రాక మానదు. విక్రమ్ వయసు ఇప్పుడు 54 ఏళ్లు. కొడుకు ధృవ్ కూడా సినిమాల్లోకి వచ్చాడు. మొదటి సినిమాతో మంచి హిట్ కూడా కొట్టాడు. అలాంటి విక్రమ్ ఇప్పుడు ఈ వయసులో లుక్‌, ఫిట్‌నెస్ లో మాత్రం కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తున్నారు. ఇక విక్రమ్ లుక్ చూసిన యంగ్ హీరోలకు సైతం షాకిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు కదా ఏమంటారు..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా అనే చిత్రంలో నటిస్తున్నాడు విక్రమ్. ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది. ఈ సినిమాతో పాటు తండ్రీకొడుకులు విక్రమ్‌, ధృవ్ ఒకే చిత్రంలో నటించనున్నట్టు తెలిసిందే కదా. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.