పర్మినెంట్ లాక్ డౌన్ రానా అంటున్న అక్షయ్..!

Bollywood Action Hero Akshay Kumar Sends Out His Best Wishes To Rana Daggubati On Their Wedding On Twitter

మరికొద్ది గంటల్లో రానా-మిహికా వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఎక్కడ చూసినా వీరిద్దరి హల్దీ ఫంక్షన్.. పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ ఫొటోల్లో రానా-మిహికా ను చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉన్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ. ఈ రాత్రి 8:30 గంటలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వివాహం జరుపనున్నారు. ఇక వివాహానికి కూడా అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడం జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా రానా-మిహికా వివాహం నేపథ్యంలో సెలబ్రిటీస్, స్నేహితులు, స‌న్నిహితులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. దీనిలోభాగంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ కూడా రానా- మిహికా దంప‌తుల‌కి ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ చెప్పారు. రానా తన ట్విట్టర్ లో మిహికా తో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఇదే నవ్వులతో జీవితం ముందుకు సాగాలని కోరుకుంటున్న అని పోస్ట్ చేయగా రానా పోస్ట్‌ని రీట్వీట్ చేస్తూ.. శాశ్వతంగా లాక్-డౌన్ అవ్వడానికి సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీ ఇద్దరు జీవితకాలం ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేసారు అక్ష‌య్. అక్షయ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. కాగా అక్ష‌య్-రానా క‌లిసి హౌజ్‌ఫుల్ 4 సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే.

 

మొత్తానికి నేటి రాత్రితో రానా తన బ్యాచ్ లర్ జీవితానికి శుభం కార్డ్ వేయనున్నాడు. కాగా ఇప్పటికే నితిన్, అఖిల్ కూడా తమ బ్యాచ్ లర్ లైఫ్ కు టాటా చెప్పేసారు. మరి లిస్ట్ లో ఇంకా ప్రభాస్, సాయి తేజ్, శర్వా ఇంకా పలువురు హీరోలు ఉన్నారు. మిగిలిన హీరోలు కొంచం లేట్ అయినా ఓకే కానీ ప్రభాస్ కు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఉన్న వాళ్లలో మోస్ట్ సీనియర్ ప్రభాసే. మరి రానా పెళ్లి ఇన్స్పిరేషన్ తో అయినా ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కుతాడేమో చూద్దాం.

ఇక రానా సినిమాల విషయానికి వస్తే .. ప్రస్తుతం రానా అరణ్య అనే ఓ సినిమాలో నటిస్తున్నాడు. విడుదలకి సిద్దంగా ఉన్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటుగా విరాటపర్వం అనే సినిమాని చేస్తున్నాడు రానా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =