మల్టీ ట్యాలెంటెడ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తోనే కాకుండా చిత్ర పరిశ్రమలో పలు విభాగాలలో తన ప్రతిభను కనపరిచారు . “జానీ “మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే సమకూర్చి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. “సర్దార్ గబ్బర్ సింగ్ ” మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ అందించారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన “డాడీ ” మూవీ లో ఒక ఫైట్ సీన్ ను పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారు . “అత్తారింటికి దారేది “, “అజ్ఞాతవాసి ” మూవీస్ కు పవన్ కళ్యాణ్ గాయకుడు గా మారారు. “జనసేన “పొలిటికల్ పార్టీ స్థాపించి సినిమాలకు దూరం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వేణుశ్రీరామ్ దర్శకత్వంలో కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ “మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ “మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచి పోయింది. లాక్ డౌన్ సమయం లో పవన్ కళ్యాణ్ తిరిగి కలం పట్టి కొన్ని స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నారని , కొంత కాలంగా తన మనసులోని ఆలోచనలను కథలు గా రూపొందిస్తూ పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని సమాచారం. “వకీల్ సాబ్ “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఒక సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ మూవీ తోపాటు క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: