కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 75

సినిమా వార్తలు

విలన్ పాత్రలో కమెడియన్ సునీల్ ?

బ్లాక్ బస్టర్ "నువ్వే కావాలి " మూవీ తో కమెడియన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన సునీల్ , పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. "నువ్వు నేను " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సునీల్ బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డు అందుకున్నారు. 2006 సంవత్సరం సూపర్ హిట్ "అందాలరాముడు " మూవీ తో సునీల్ హీరోగా మారారు.ఆ మూవీ లో తన డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కమెడియన్ గా నటిస్తూనే సునీల్ హీరోగా నటించిన "మర్యాద రామన్న ", "పూలరంగడు ", "భీమవరం బుల్లోడు " మూవీస్ విజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ-మారుతి కాంబినేషన్ లో మూవీ..?

టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త కొత్త కాంబినేషన్స్ లో మూవీస్ సెట్ అవుతున్నాయి. డైరెక్టర్స హీరోలకు తగినట్టు కొత్త కొత్త కథలను రాస్తున్నారు.. హీరోలు కూడా ఒకే జోనర్ కు ఫిక్స్ అవ్వకుండా కొత్త కొత్త ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆహీరో-డైరెక్టర్ ఎవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ-మారుతి. వీరిద్దరూ కలిసి త్వరలో సినిమా చేయబోతున్నట్టు టాక్స్ నడుస్తున్నాయి. ఇటీవ‌లే మారుతి హీరో ర‌వితేజ‌కు క‌థ వినిపించార‌ని, రవితేజ కూడా ఓకే చేశార‌ని తెలిసింది. ఈ చిత్రాన్ని ఎవ‌రు నిర్మిస్తారు? .. హీరోయిన్ ఎవ‌రు? వ‌ంటి వివ‌రాల్ని త్వ‌ర‌లోనే…

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Blockbuster Movie Srimanthudu Completes 5 Years
సినిమా వార్తలు

5 సంవత్సరాల "శ్రీమంతుడు "

జి. మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , శృతి హాసన్ జంటగా ఊరు దత్తత నేపథ్యంలో రూపొందిన యాక్షన్ డ్రామా "శ్రీమంతుడు "మూవీ 2015 సంవత్సరం ఆగస్ట్ 7 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ , ఐఫా , సైమా అవార్డ్స్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం "శ్రీమంతుడు "మూవీకి హైలైట్ గా నిలిచింది .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' - 'ఫ్రెండ్ షిప్' పై రాజమౌళి ఫోకస్

ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో పలు హైలైట్ సీన్స్ ఉంటాయని.. ఎన్టీఆర్ పలు గెటప్స్ లో కనిపించనున్నాడని.. బాహుబలి కంటే ఈ సినిమా పది రెట్లు గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని ఇలా ఎన్నో వార్తలు విన్నాం. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో రాజమౌళి ఫ్రెండ్ షిప్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫ్రెండ్ షిప్ ను సాలిడ్ గా చూపించనున్నారట. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఫ్రెండ్ షిప్ పై ఒక స్పెషల్ సాంగ్ ను కూడా కంపోజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మంచి ఆర్టిస్టిక్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మనోజ్ మంచు సినీ జర్నీ

విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మనోజ్ మంచు "దొంగ దొంగది " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. "దొంగ దొంగది " మూవీ 2004 సంవత్సరం ఆగస్ట్ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "శ్రీ ", "నేను మీకు తెలుసా ?", "బిందాస్ ", "వేదం ", కరెంట్ తీగ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో మనోజ్ ప్రేక్షకులను అలరించారు. 3 సంవత్సరాలు గ్యాప్ తరువాత మనోజ్ "అహం బ్రహ్మస్మి " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గిరిజన యువతి పాత్రలో కాజల్ అగర్వాల్?

ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు ,తమిళ , హిందీ భాషలలో రూపొందిన "అరణ్య " మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ప్రముఖ పర్యావరణ వేత్త , గిరిజన రైతు జయదేవ్ పాయంగ్ జీవిత చరిత్ర ఆధారంగా "అరణ్య " మూవీ రూపొందింది. అస్సాం రాష్ట్రం లోని నిరుపయోగ భూమిని 40సంవత్సరాలుగా మొక్కలు నాటి అడవిగా జయదేవ్ మార్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులకు మహేష్ విజ్ఞప్తి - అన్నిటికంటే అదే ముఖ్యం..!

కరోనా వల్ల టాలీవుడ్ హీరోలు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది హీరోలు తమ పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని కోరగా ఇప్పుడు తాజాగా మహేష్ కూడా తన అభిమానులను అదే కోరుతున్నారు. ఈనెల 9వ తారీఖు మహేష్ పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కు పండగతో సమానం కదా.. ఈ నేపథ్యంలో ఇప్పటినుండే పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తన పుట్టినరోజులు వేడుకలు జరపొద్దని అభిమానులను కోరుతున్నాడు మహేష్. ఈ సందర్భంగా తన ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి కన్నుమూత

గతకొద్దిరోజులుగా కరోనా సినీ పరిశ్రమను బాగా దెబ్బతీసింది అని వింటూనే ఉన్నాం. ఒకపక్క షూటింగులు, రిలీజ్ లు లేక బిజినెస్ సరిగా జరగగా కోట్లలో నష్టం వస్తుంటే.. మరోపక్క ఎంతో మంది నటీనటులు ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏదైనా కానీ ఈ ఏడాదిలో అది కూడా కరోనా స్టార్ట్ అయిన తర్వాత సినీ పరిశ్రమల్లో చూసిన చావులు ఎప్పడూ చూడలేదంటే అతిశయోక్తి కాదు. లెజెండ్రీ నటీనటుల దగ్గర నుండి యువ నటీనటులు ఎంతో మంది తనువు చాలించారు. ఇప్పుడు మరో సంఘటన చోటుచేసుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాలిడ్ ఎంటర్ టైనర్ మూవీ

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ "గబ్బర్ సింగ్ " రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శృతి హాసన్ కథానాయిక. "గబ్బర్ సింగ్ " మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. హీరో పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటించిన "గబ్బర్ సింగ్ " మూవీ విశేష ప్రేక్షకాదరణ పొంది సుమారు 150 కోట్లు కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఇండియన్ 2' - మృతుల కుటుంబానికి కోటి విరాళం

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాకు మొదటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎలా షూటింగ్ మొదలైంది అనుకునే లోపు క్రేన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఘటనతో మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఇక కేసులు.. విచారణలు అంటూ తిరిగేలోపు కరోనా వచ్చేసింది. దీనితో అసలు షూటింగులే లేకుండా పోయాయి.

TFN Adminవాట్సాప్
Malayalam Superstar Mammootty Makes An Interesting Revelation About His Son Dulqer Salmaan
సినిమా వార్తలు

150 రోజులుగా ఇంట్లోనే..!

లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఎంత సోషల్ డిస్టెన్స్ అయినా అన్ని రోజులు ఇంట్లోనే ఉండాలంటే చాలా మందికి కష్టమే. డబ్బున్న వారికి అంటే ఎలా అయినా సాగిపోతుంది కానీ పేద ప్రజలకు మాత్రం అలా కాదుగా.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు ఎందరివో. ఇక సెలబ్రిటీస్ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తున్నారనుకోండి. అయితే ఒక హీరో మాత్రం 150 రోజుల కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే ఉన్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు మలయాళం సీనియర్ హీరో మమ్ముట్టి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎవరితో పోటీ లేదు - తమన్నా

తెలుగు , తమిళ , హిందీ చిత్రాలతో తమన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొన్ని మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను తమన్నా అభిమానులతో పంచుకుంటున్నారు. తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ " మూవీలో కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. ఒక హిందీ మూవీ లో కూడా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rebel Star Prabhas Spotted In Public Sporting A Safety Mask
సినిమా వార్తలు

పబ్లిక్ లో ప్రభాస్ సందడి..!

మిగిలిన హీరోలు అప్పుడప్పుడు పబ్లిక్ లో కనిపిస్తారేమో కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బయట కనిపించడం చాలా అరుదు. మరి అలాంటి హీరో పబ్లిక్ లోకి వస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా... ఇప్పుడు అదే జరిగింది. ఈ రోజు ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకి వచ్చారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ప్రభాస్ ను చుట్టుముట్టారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులతో పాటు ఫ్యాన్స్ కూడా ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. మాస్క్‌ ధరించే ప్రభాస్‌ ఫొటోలు దిగారు. ఇక ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిర్మాతగా మారిన నటుడు కృష్ణుడు

"వినాయకుడు ", "విలేజ్ లో వినాయకుడు " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృష్ణుడు ఇప్పుడు నిర్మాతగా మారారు. నిత్యా క్రియేషన్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి ఒక మూవీ ని నిర్మించారు. ఒక కొత్త దర్శకుడి ని కృష్ణుడు టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ మూవీ విశేషాలు తెలుసుకుందాం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాస్క్ సుందరి ప్రీతిజింటా

సూపర్ హిట్ "దిల్ సే " మూవీ తో ప్రీతిజింటా బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ "ప్రేమంటే ఇదేరా " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. మహేష్ బాబు టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సూపర్ హిట్ మూవీ "రాజకుమారుడు" లో ప్రీతి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత ప్రీతిజింటా హిందీ మూవీస్ తో బిజీగా మారారు.ప్రీతి హీరోయిన్ గా నటించిన పలు బాలీవుడ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'జీరో బడ్జెట్ గార్డెనింగ్' టిప్స్ ఇస్తున్న సామ్..!

లాక్ డౌన్ లో రియల్ లైఫ్ లో సమంత ఎంత సింపుల్ గా ఉంటుందో తెలుస్తుంది. లాక్ డౌన్ లో ఉన్న ఖాళీ సమయాన్ని భర్త చైతన్య తో కలిసి ఎంజాయ్ చేస్తూనే మరో పక్క గార్డెనింగ్ చేస్తూ, కూరగాయలు పండిస్తూ కాలక్షేపం చేస్తుంది. అంతేకాదు ఇంటి టెర్రస్‌పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించింది. వాటికి సంబందించిన ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. అంతేకాదు ఎలా పెంచాలి.. దీనికోసం ఏమేం చేయాలి.. టెర్రస్ పై ఉన్న ఖాళీ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి.. కూరగాయలను ఎలా పండించాలి ఇలా పలు సూచనలు కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి అర్బన్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలో చెపుతుంది. దానికోసం ఒక వీడియోను కూడా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..?

రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో అభిమానులు పవన్ సినిమా ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా కొద్దిరోజుల్లో వకీల్ సాబ్ సినిమా రాబోతుంది అనుకుంటుండగా ఈలోపు కరోనా రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఇంకా కొద్దిపాటి షూటింగ్ మాత్రమే ఉంది. ఇక ఆ పార్ట్ కూడా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న విరూపాక్ష సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja Action Packed Love Entertainer Don Seenu Completes 10 Years.
సినిమా వార్తలు

10 వసంతాల "డాన్ శీను "

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజా హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ "డాన్ శీను " మూవీ 2010 సంవత్సరం ఆగస్ట్ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ మూవీ లో శ్రియ కథానాయిక. 5సంవత్సరాల గ్యాప్ తరువాత శ్రియ "డాన్ శీను " మూవీ లో నటించడం విశేషం. హీరో రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'శ్రీదేవి' సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో 'కీర్తి సురేష్'..?

సూపర్ హిట్ అయిన సినిమాలను ఈ మధ్య సీక్వెల్స్ చేయడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వచ్చే హిట్ సినిమాలకు సీక్వెల్స్ అంటే ఓకే కానీ ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ అంటే ఇప్పుడు కష్టమే. ఇప్పుడు అలాంటి ఒక సినిమానే సీక్వెల్ తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒకటి కాదు రెండు కాదు 42 ఏళ్ళ తర్వాత.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రౌడీ హీరోతో బీస్ట్..!

లాక్ డౌన్ లో ఇంట్లో ఉన్న విజయ్ దేవకొండ ఫ్యామిలీతో టైంను స్పెండ్ చేస్తున్నాడు. అయితే సోష‌ల్ మీడియా ద్వారా సినిమాతో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉన్నాడు. ఈ లాక్ డౌన్ లో విజయ్ కు ముఖ్యంగా తన పెట్ డాగ్ తో ఎక్కువ సేపు ఆడుకునే టైమ్ దొరికింది. దానితో ఆడుకునే ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే త‌ల‌పై కుక్క‌ని కూర్చోపెట్టుకొని బెడ్‌పై కుక్క‌తో ఫోటోకి ఫోజులిస్తూ తీసుకున్న ఫొటోలు పోస్ట్ చేయగా అవి అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఫొటో పోస్ట్ చేసాడు. తన పెట్ డాగ్ తో తీసుకున్న ఫొటో ను పోస్ట్ చేసి 'మై క్యూట్ బీస్ట్' అంటూ…

TFN Adminవాట్సాప్

షేర్