ప్లాస్మా డొనేషన్ కై చిరంజీవి పిలుపు

Mega Star Chiranjeevi Urges People Recovered From COVID 19 To Donate Their Blood Plasma

కరోనా మహమ్మారి వ్యాధి నుండి కోలుకున్న వారి బ్లడ్ ప్లాస్మా తో మరికొంతమంది ప్రాణాలు రక్షించవచ్చనే విషయం తెలిసిందే. కరోనా నుండి కోలుకున్న వారి ప్లాస్మా దానానికై సైబరాబాద్ కమిషనరేట్ లో సి పి సజ్జనార్ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్లాస్మా దానం చేసిన కొంతమంది దాతలను సజ్జనార్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మెగా స్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ .. కరోనా విపత్కర పరిస్థితులలో సైబరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ చేపట్టిన కార్యక్రమం అభినందనీయమని , ప్లాస్మా డొనేషన్ కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లా కొనసాగిస్తున్న సి పి సజ్జనార్ గారికి మనస్ఫూర్తిగా అభినందన లని, డాక్టర్స్ , పోలీస్ , పారా మెడికల్ సిబ్బందికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశానని , ఆ బ్లడ్ బ్యాంక్ కు బెస్ట్ బ్లడ్ బ్యాంక్ గా అవార్డ్ వచ్చిందని, తన ఇంటిలో పనిచేసేవారికి కరోనా సోకిందని , వారు కరోనా నుండి కోలుకున్నారని , ప్లాస్మా డొనేషన్ కై వారిని తీసుకొచ్చానని, ప్లాస్మా కరోనా బాధితులకు సంజీవని వంటిదని, ప్లాస్మా డొనేట్ చేసి మరికొంతమంది ప్రాణాలు కాపాడండి అంటూ చిరంజీవి ప్లాస్మా దాతలకు పిలుపునిచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − ten =