టాలీవుడ్ న్యూస్ వీక్లీ రౌండప్

TFN Weekly Roundup : Latest Telugu Movie Updates

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు ‘దితెలుగుఫిలింనగర్ .కమ్’ ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఆకాశవాణి’ ఫస్ట్ లుక్ రిలీజ్

అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆకాశవాణి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఏ యు &ఐ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి. రానా చేతుల మీదుగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

సంక్రాంతి కి కె.జి.యఫ్2..?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా కె.జి.యఫ్2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ దశలో వుంది. దాదాపు చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోగా… కరోనా వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

శర్వా కొత్త సినిమా ప్రకటన

ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీ‌కారం’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగు-త‌మిళ భాషలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్‌) బ్యానర్‌పై నారాయణ్‌దాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు..? అలాగే హీరోయిన్ మిగితా నటీనటుల వివరాలను త్వరలోనే తెలుపనున్నారు.

సింగర్స్ బాలు, స్మిత, డైరెక్టర్ తేజకు కరోనా

ఈ వారంలో పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోగా క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయింద‌ని.. ప్ర‌స్తుతం చెన్నైలోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు తెలిపారు. సింగర్ స్మిత కు పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఇంకా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ కూడా క‌రోనా బారిన పడ్డారు.

సాహో డైరెక్టర్ ‘సుజీత్’ వివాహం

సాహో డైరెక్టర్ సుజీత్ వివాహం ఆగష్ట్ 3వ తేదీన జరిగింది. డైరెక్టర్ సుజీత్ తన ప్రియురాలు ప్రవల్లికను వివాహం చేసుకున్నారు. కొద్దిపాటి కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. జూన్ లో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.


5ఏళ్ల శ్రీమంతుడు

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. 2015 సంవత్సరం ఆగస్ట్ 7 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈసినిమా ఆగష్ట్ 7, 2020 నాటికి 5ఏళ్లు పూర్తి చేసుకుంది. జి. మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఈ సినిమా నిర్మించారు.

ప‌రుచూరి వెంకటేశ్వరరావుకు స‌తీవియోగం

ప‌రుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె తుది శ్వాస విడిచారు. విజ‌య‌ల‌క్ష్మీ మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తూ, వెంక‌టేశ్వ‌ర‌రావుకి ప్ర‌గాఢ సానుభూతి తెలియచేసారు.

మృతుల కుటుంబానికి విరాళం

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో క్రేన్ యాక్సిడెంట్ జరిగిన సంగతి కూడా విదితమే. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకోడానికి ముందుకొచ్చారు హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ హౌస్ లైకా సంస్థ. నలుగురు చనిపోగా.. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు విరాళం అందచేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.