‘కె.జి.యఫ్’ కు ‘బాహుబలి’ సినిమానే స్పూర్తి..!

KGF Movie Was Inspired From Rajamouli Bahubali Says Actor Yash

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు అవి. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ఇక ఈ సినిమా ఎన్నో సినిమాలకు స్ఫూర్తి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు బాహుబలి ఒక ఇన్స్పిరేషన్. అంతేకాదు ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ కి కూడా బాహుబలినే ఇన్స్పిరేషన్ అంటున్నాడు యష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈ సినిమాను కన్నడలోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేద్దామనుకున్నారట. అయితే బాహుబలి డబ్బింగ్ సినిమా చూసిన తర్వాత తమ ప్లాన్ చేసుకున్నారట. తెలుగు హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేయడానికి కారణం అదేనట. నిజంగా రాజమౌళి సర్ మాకు చాలా ఇన్స్పిరేషన్.. మా సినిమా రషెస్ చూపించిన తర్వాత చాలా బావుందని చెప్పారు.. అదే మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది సినిమా హద్దుల్ని ఆయన చెరిపేసారు.. ప్రాంతీయ సినిమాలు తీయడంలో ఇప్పుడు సీరియస్ గా తీయడానికి ఒకరకంగా ఆయనే కారణమని తెలిపాడు.

కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యష్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా… బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =