కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మద్దతు పలుకుతూ వారు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన చేపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీస్ ఇప్పటికే స్పందించి ప్లాస్మా డొనేషన్ చేయాలని కోరారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా ప్లాస్మా డొనేషన్ పై పిలుపనిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు, ప్రజలకు మహేష్ ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండటం ఎంతో అవసరం.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ప్లాస్మా డొనేషన్ ప్రాముఖ్యత ప్రజలందరికి తెలియచేయడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ ఎవేర్నెస్ తో ముందుకొచ్చి ప్లాస్మా డొనేట్ చేసిన వారందరిని అభినందిస్తున్నాను. సాటి మనుషుల ప్రాణాల్ని కాపాడటానికి దోహదపడే ప్లాస్మాను డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా నా బర్త్ డే సందర్భంగా అభిమానులందరూ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని అవకాశం వున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా డొనేట్ చేయాలని కోరారు. ఈ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ ను పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా నిర్వహిస్తుంది..ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కు అభినందనలు.. ముఖ్యంగా అనుక్షణం ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ.. ఈ ప్లాస్మా డొనేషన్ గురించి ప్రజలకు చెప్తూ.. ఎందరో ప్రాణాల్ని కాపాడుతున్న పోలీస్ కమిషనర్ సజ్జనార్ కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కరోనా నుండి కోలుకున్నవారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లు అవుతారు. ప్లాస్మా డొనేట్ చేయండి.. ఇంకొకరి ప్రాణాలు కాపాడండి.. అంటూ మహేష్ పిలుపునిచ్చారు.
ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను చేయనున్నాడు మహేష్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: