‘సూపర్ స్టార్’ బిరుదుకు అసలైన నిర్వచనం మహేష్

Mahesh Babu Rightly Deserves The Super Star Title

హీరో అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిందే. అలాంటిది సూపర్ స్టార్ అంటే ఇంకెన్ని క్వాలిటీస్ ఉండాలి. ఊరికే సూపర్ స్టార్ లు అయిపోరు కదా. ఇక ఈ సూపర్ స్టార్ బిరుదుకు అసలైన నిర్వచనం మహేష్ అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. నటన మాత్రమే కాదు స్టైల్, అందం అన్నిటికి మించి పర్సనల్ బిహేవియర్ ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నాడు. తన అందంతో మొదట ప్రిన్స్ మహేష్ అనిపించుకున్న మహేష్ ఆ తర్వాత తన విజయాలతో సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక బిరుదు రాకముందు కంటే వచ్చిన తర్వాతే అసలైన అగ్నిపరీక్ష మొదలవుతుంది. కానీ మహేష్ మాత్రం తన సినిమాలతో, పనులతో సూపర్ స్టార్ అనే బిరుదుకు అన్ని విధాలా అర్హుడు అనిపించుకుంటున్నాడు. ఇక ఈ రోజు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ గురించి పలు విషయాలు తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాలు-ప్రయోగాలు

ఎంతైనా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు కదా. కృష్ణ కూడా ఎన్నో ప్రయోగాలు చేసేవారు. అలా చేశారు కాబట్టే ఎన్నో రికార్డ్స్ ను వారి ఖాతాలో వేసుకున్నారు. ఇక కృష్ణ తనయుడిగా మహేష్ కూడా ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుంటారు. ఒక్కోసారి అవి మంచి ఫలితాలను అందించలేకపోవచ్చు ఇప్పుడున్న హీరోల్లో ప్రయాగాలు ఎవరు చేస్తారు అంటే మాత్రం మహేష్ పేరే ముందు వినిపిస్తుంది. ఒక నాని కానీ, ఖలేజా కానీ, స్పైడర్ కానీ ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే మాత్రం మహేష్ కే సాధ్యం. అంతేకాదు మహేష్ ను డైరెక్టర్స్ హీరో అని కూడా అంటారు. ఎందుకంటే ఒకసారి సినిమా కమిట్ అయ్యాడంటే ఆ తర్వాత డైరెక్టరు ఏం చెపితే అదే వేదం. డైరెక్టర్స్ కు ఎలా చేయమంటే అలా చేసుకుంటూ వెళ్లడం తప్పా స్క్రిప్ట్ లో మార్పులు లాంటిని.. డైరెక్టర్స్ మాట వినకపోవడం లాంటిని వుండవు. అందుకే డైరెక్టర్స్ హీరో అయ్యాడు.

ఫ్యామిలీ పర్సన్

సినిమాలు అంటే ఎంత డెడికేషన్ తో ఉంటాడో అంతే టైం ను ఫ్యామిలీకి కేటాయిస్తాడు. తెలుగు ఇండస్ట్రీలో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో ముందుండేది మహేష్ బాబు. ఆయనకు సినిమాలు తర్వాత.. ముందు ఫ్యామిలీనే ముఖ్యం. సెలవులు లేకపోయినా కూడా షూటింగ్స్ ఆపేసి మరీ కుటుంబం కోసం సమయం కేటాయిస్తుంటాడు. సినిమా అయిపోయిన తర్వాత కూడా ఫ్యామిలీతో కలిసి పక్క ట్రిప్ వేయాల్సిందే. గౌతమ్-సీతారాలతో కలిసి టైం స్పెండ్ చేయడం మహేష్ కు చాలా ఇష్టం. ఇప్పుడు లాక్ డౌన్ లో మహేష్ ను చూస్తుంటేనే చెప్పొచ్చు గౌతమ్-సీతారాలతో కలిసి ఎంత అల్లరి చేస్తాడో.. ఎలా ఆటలు ఆడుతాడో.

సమాజ సేవ

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే సాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భరత్ అనే నేను సినిమాలో అంతఃకరణ శుద్దితో అన్న డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అలా చేయాలన్న తపన ఉండాలే కానీ దానికి ప్రచారం అవసరం లేదు. అలా అంతఃకరణ శుద్దితో సమాజ సేవ చేస్తుంటాడు మహేష్. ఎప్పుడో ఎక్కడో వార్తలు వస్తే కానీ మహేష్ చేసే సాయం బయటకి రాదు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తుంటారు.. చిన్న పిల్లలకు ఎలాంటి విపత్తు వచ్చినా తనవంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. ఇక ఊరు దత్తత కాన్సెప్ట్ కూడా మహేష్ వల్లే తెరపైకి వచ్చింది. తన ‘శ్రీమంతుడు’ సినిమాతో ఇన్స్పైర్ అయిన మహేష్ ఆ స్ఫూర్తి తో రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ కు కనెక్ట్ అయి చాలా మంది చాలా ఊర్లు దత్తత తీసుకున్నారు.

పెర్ఫెక్ట్ బిజినెస్ పర్సన్

కేవలం సినిమాలే కాదు బిజినెస్ పరంగా కూడా మహేష్ నెం.1 అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. ఇప్పటికే నిర్మాణరంగంలో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు నిర్మిస్తున్నారు. మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి కూడా ప్రవేశించారు. టెక్స్ టైల్ బిజినెస్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇంకా యాడ్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మహేష్ సినిమాలతో బిజీ గా ఉంటే సతీమణి ఆయన వ్యాపారాల్ని చక్కగా చూసుకుంటుంది. ఇంకా డిజిటల్ రంగంలోకి కూడా మహేష్ రావడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

స్పెషల్ అచ్చివ్ మెంట్స్

ఇంకా వీటన్నితో పాటు పలు స్పెషల్ అచ్చివ్ మెంట్స్ ను కూడా మహేష్ సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సౌత్ ఇండియన్ హీరో మహేష్ బాబు ఒక్కరే. ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా యూత్ లో ఆయా హీరోలకు ఉన్న పాపులారిటీ ఆధారంగా ర్యాంక్స్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో మోస్ట్ డిసైరబుల్ మెన్ లిస్ట్ లో పలుమార్లు తన పేరును నమోదు చేసుకున్నారు. గత ఏడాది బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

1975 ఆగష్ట్ 9న జన్మించిన మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో చేసి.. రాజకుమారుడు సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. ఈ 21 ఏళ్లలో ఎన్నో జయాపజయాలను చవిచూశారు. మురారి, అతడు, ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ లభించాయి. ప్రస్తుతం మహేష్ తన తర్వాత సినిమా పరుశురాం తో చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

మరి ముందు ముందు ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని .. ఇలానే సూపర్ స్టార్ గా ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =