తన పుట్టిన రోజు వేడుకలు చేయొద్దని ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచినా తన కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను కుష్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్‌తో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తన పుట్టిన రోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ మూవీ నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మోషన్ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ మహేష్ బాబు బర్త్ డే ట్వీట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేసే పనిలో పడ్డారు.
Hungama Shuru 💥
Here’s the electrifying Motion Poster of #SarkaruVaariPaata 🔔https://t.co/hI9QiSnYQv#HBDMaheshBabu 💝Super ⭐ @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents
— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2020
పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మెసేజ్ తో సాగే ఫుల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: