ఎకో ఫ్రెండ్లీ గణపతి ని పూజిద్దాం – శ్రద్ధాకపూర్

Saaho Fame Shraddha Kapoor Urges Everyone To Worship Eco Friendly Ganesh Idols To Protect The Environment.

యాక్ట్రెస్ , సింగర్ శ్రద్ధాకపూర్ “తీన్ పత్తి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఆషికి 2 “, “ఏక్ విలన్ “, “ABCD 2”, “బాఘీ “, “హాఫ్ గర్ల్ ఫ్రెండ్ “, ” స్త్రీ “, “సాహూ “, “చిచ్చోరె” వంటి సూపర్ హిట్ మూవీస్ తో శ్రద్ధాకపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ మూవీ “సాహూ ” తో శ్రద్ధాకపూర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శ్రద్ధాకపూర్ ప్రస్తుతం ” స్ట్రీట్ డ్యాన్సర్ 3డి “, “బాఘీ 3 ” మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినాయక చవితి భారతీయులందరికీ ముఖ్య పండగ. హైదరాబాద్ లోప్రతీ వీధికీ వినాయక మండపాలు కొలువుతీరతాయి. లక్షలాది మంది ప్రజలు ఖైరతాబాద్ లో కొలువుతీరిన వినాయకుని దర్శించుకుంటారన్న విషయం తెలిసిందే. ముంబై లో కూడా వినాయక చవితి పండగను అత్యంత వైభవం గా జరుపుతారు. పర్యావరణ పరిరక్షణ , వన్య ప్రాణుల హక్కుల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చే శ్రద్ధాకపూర్ , కొన్ని రోజులలో వినాయక చవితి పండగ రానున్న సందర్భంలో ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గణపతి ని పూజించడంతో నీరు కలుషితం కాదని , ప్రతీ ఒక్కరూ తమ ఇంటిలో ఎకో ఫ్రెండ్లీ గణపతి ని పూజించండి , పర్యావరణ పరి రక్షణ చేయండి అంటూ శ్రద్ధా కపూర్ కోరారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 14 =