డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్న స్టైలిస్ట్ నీరజ కోన ..!

Stylist and Costume Designer Neeraja Kona Turns Film Director

ఈ మధ్య ఇండస్ట్రీలో కొత్త కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డైరెక్టర్స్ అంటే డైరెక్షన్.. హీరోలంటే నటన.. నిర్మాతలంటే కేవలం నిర్మాణం మాత్రమే చెయ్యట్లేదు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మధ్య హీరోలు డైరెక్టర్స్ కూడా నిర్మాతలవుతున్నారు. కొంతమంది హీరోలు రైటర్లు గా కూడా మారుతున్నారు. కొంత మంది డైరెక్షన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో స్టైలిస్ట్ కూడా డైరెక్షన్ వైపుఅడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ స్టైలిస్ట్ ఎవరో కాదు నీరజ కోన.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నీరజ కొన.. ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. కాస్ట్యూమ్స్ డిజైనర్ గా బాద్ షా సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన నీరజ కోన తన టాలెంట్ తో మంచి పేరును సొంతం చేసుకుంది. సమంత, రకుల్ తో పాటు పలువురు స్టార్స్ కు ఈమె స్టైలిస్ట్ గా పనిచేశారు. తెలుగులోనే కాద తమిళ హీరోలైన విజయ్, కార్తీ, సూర్య లాంటి స్టార్ హీరోలకు కూడా స్టైలిస్ట్ గా పని చేసింది. ఇక ఇన్ని రోజులు స్టైలిస్ట్ గా చేసిన నీరజ ఇప్పుడు డైరెక్షన్ చేయడానికి సిద్ధమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నీరజ త్వరలోనే ఓ చిత్రానికి డైరెక్షన్ చేస్తా అని… రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే కొంతమంది నటులను సంప్రదించినట్టు చెప్పింది. అంతేకాదు తనదగ్గర ఐదు స్క్రిప్ట్ లు సిద్ధంగా ఉన్నాయని కూడా తెలిపింది. మరి ఇన్ని రోజులు స్టైలిస్ట్ గా అలరించిన నీరజ డైరెక్టర్ గా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.

ఇంకా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నీరజ పలు వంటలను కూడా షేర్ చేస్తుంటుంది. లాక్ డౌన్ లో రకరకాల వంటలు ట్రై చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాదు నీరజ కోన కి హైదెరాబాదులో ఓ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =