కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 63

సినిమా వార్తలు

ఓనం పండగ వేడుకలలో అనుపమ పరమేశ్వరన్

కేరళ రాష్ట్రం లో ప్రజలు ఓనం పండగ ను ఆనందంగా , వైభవంగా జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఓనం పండగ వేడుకలను సంసృతి , సంప్రదాయం , ఆచారాలతో ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండగ లో పూల మాలలు , ముగ్గులు , కొత్త దుస్తులు , నృత్యాలు , పడవ పందెములు వంటివి ముఖ్యమైనవి. హిందూ మతానికి సంబంధించినప్పటికీ ఓనం పండగ ను హిందువులతో పాటు ముస్లిమ్స్ , క్రిస్టియన్స్ కూడా జరుపుకొనడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ - త్వరలోనే బిగ్ అనౌన్స్‌మెంట్..!

తమ అభిమాన హీరో సినిమాల నుండి అప్ డేట్స్ రావడం లేట్ అయితే చాలు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. షూటింగ్ లు గట్రా ఏమన్నా ఉంటే వాళ్లు కూడా ఏదన్నా అప్ డేట్ ఇస్తారు. కానీ ప్రస్తుతం పరిస్థితి వేరు. అప్పటికీ ఫ్యాన్స్ కు ఊరట కలిగించేందుకు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. మొన్నటి వరకూ ప్రభాస్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూసారు. ఫైనల్ గా వారికి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రతి ఆర్టిస్ట్ కు ఆ కోరిక ఉంటుంది

కథల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా వుంటూ.. విభిన్నమైన పాత్రల్లో నటించే నటులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వాళ్లల్లో నివేదా థామస్ కూడా ఒకటని చెప్పొచ్చు. మొదటి నుండి స్క్రిప్ట్స్ విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటుంది నివేదా. అందుకే తను నటించే సినిమాలు మాగ్జిమం సక్సెస్ ను సొంతం చేసుకుంటాయి. ఇక ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నివేదా థామస్‌ ఈ సినిమా గురించి పలు విషయాలు పంచుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అందాల "చందమామ "

"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ సూపర్ హిట్ "చందమామ " మూవీ తో గుర్తింపు పొందారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కాజల్ ప్రస్తతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2 ", "హే సినమిక "(తమిళ ), "ముంబై సాగ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఓటీటీ

ఓటీటీ రిలీజ్ పై నాని - ఎవరో ఒకరు ధైర్యంగా స్టెప్ తీసుకోవాలి

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'వి' సినిమా ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. వచ్చే నెల సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయనున్నారు. ఇక ఓటీటీ లో తెలుగులో ఇప్పటివరకూ అన్నీ చిన్న సినిమాలే వచ్చాయి. ఇప్పటిదాకా ‘వి’ స్థాయి సినిమా ఏదీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తనయుడికి ప్రేమతో బర్త్ డే విషెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఈ రోజు 14వ వ‌సంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా తనయుడికి మహేష్, నమ్రత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. మహేష్ తన ఇన్స్టా, ట్విట్టర్ లలో పసికందు గౌతమ్ ను ఎత్తుకున్న ఫొటో ను పోస్ట్ చేస్తూ.. 14వ వ‌సంతంలోకి అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉంది... హ్యాపీ 14.. నువ్వు యువ‌కుడిగా ‌ ఎదుగుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. డోరేమాన్ నుంచి అపెక్స్ లెజెండ్స్ వ‌ర‌కు నీతో క‌లిసి చేసిన ప్ర‌యాణం ప్ర‌త్యేకమైన‌ది. నీకు బెస్ట్ బ‌ర్త్‌డే విషెస్‌. ల‌వ్ యూ గౌత‌మ్" అని రాసుకొచ్చారు.

TFN Adminవాట్సాప్
Cute Picture of Superstar Mahesh Babu & Sitara
సినిమా వార్తలు

చిరు నవ్వులతో మహేష్ బాబు , సితార

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా మహేష్ బాబు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. మహేష్ బాబు కు తనయుడు గౌతమ్ , తనయ సితార ఉన్న విషయం తెలిసిందే. సితార తన క్యూట్ డ్యాన్స్ స్టెప్స్ తో వీడియోస్ రూపొందించి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్నారు . కుటుంబానికి అధిక ప్రాధాన్యత నిచ్చే మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Allu Sirish Remembers His Grand Father For Teaching Him Telugu Language On The Occasion Of Telugu Language Day
సినిమా వార్తలు

తెలుగు భాషాదినోత్సవం - మా తాత వల్లే నేర్చుకున్నా..!

కేవలం వ్యక్తిగత విషయాలు.. సినిమా అప్ డేట్స్ మాత్రమే కాదు అప్పుడప్పుడు పలు ఆసక్తికర విషయాలు కూడా తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాడు అల్లు శిరీష్. ఇటీవలే గో లోకల్ బీ లోకల్ అని మన ఇండియన్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలని.. మన ఆర్థిక వ్యవస్థను కాపాడాలని కోరాడు. ఇక ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Tollywood Actor Nagarjuna Shares His Excitement With Audience On Joining Shoot of Bigg Boss Season 4
షూటింగ్ అప్‌డేట్

మళ్లీ షూటింగ్ కు వెళ్తున్నా

లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా తిరిగి వర్క్ మోడ్ లోకి వెళ్లనున్నట్టు తెలుపుతున్నారు. ఈ రోజు త‌న 61వ బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా నాగార్జున వైల్డ్ డాగ్ నుండి స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 'వైల్డ్ డాగ్' బృందంలో స‌భ్యులైన అలీ రెజా (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), ఆర్యా పండిట్ (స్పెష‌ల్ ఏజెంట్ - రా), కాలెబ్ మాథ్యూస్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), రుద్రా గౌడ్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), హ‌ష్వంత్ మ‌నోహ‌ర్…

TFN Adminవాట్సాప్
Tollywood Actor Naga Shaurya Flaunts His 8 Pack Abs In A Workout Pic Shared Recently On Social Media.
సినిమా వార్తలు

8 ప్యాక్ అబ్స్ తో నాగశౌర్య

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్ డ్రామా "#NS20"మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్నారు. ఆ క్యారెక్టర్ కు తగ్గట్టుగా నాగశౌర్య తన బాడీ ని మౌల్డ్ చేసుకుంటున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "#NS20"మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Actress Kangana Ranaut To Play Air Force Pilot In Tejas Movie
సినిమా వార్తలు

ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ పాత్రలో కంగనా రనౌత్

సూపర్ హిట్ "గ్యాంగ్ స్టర్ " మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన కంగనా రనౌత్ "ఫ్యాషన్ ", "తను వెడ్స్ మను ", "క్రిష్ 3", "క్వీన్ ", "తను వెడ్స్ మను రిటర్న్స్ ", " మణికర్ణిక" వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఏక్ నిరంజన్ "తెలుగు మూవీ లో కంగనా రనౌత్ నటించారు. కంగనా రనౌత్ ప్రస్తుతం లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ మూవీ "తలైవి "తమిళ మూవీ లో జయలలిత పాత్రలో నటిస్తున్నారు. "తలైవి " మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది. కంగనా ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Samantha Akkineni Gives A Fun Counter To Question Asked By Audience On Instagram Live Chat
సినిమా వార్తలు

2017 నుంచే ప్రెగ్నెంట్ గా ఉన్నా- సామ్ కౌంటర్

సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కు విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. మన సెలెబ్రిటీస్ ఏమన్నా తక్కువా.. వారి ప్రశ్నలకు తగ్గట్టే రివర్స్ లో కౌంటర్లు వేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక ప్రశ్నకే సమంతకు ఎదురవ్వగా.. సమంత ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియా క్వీన్ సామ్ ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో కూడా ముచ్చటిస్తూనే ఉంటుంది. అలానే తాజాగా ఇన్‌స్టాలో `ఆస్క్ సమంత` సెషన్‌ లో పాల్గొంది. ఈ సందర్భంగా.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో…

TFN Adminవాట్సాప్
Actress Rashmika Mandanna Adores Spending Time With Animals During Her Quarantine.
సినిమా వార్తలు

జంతు ప్రేమికురాలు రష్మిక

ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రష్మిక టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో దూసుకుపోతున్నారు. తన అందం , అభినయం తో రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు, రష్మిక నటించిన "పొగరు "కన్నడ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. "సుల్తాన్ " మూవీతో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Director Satish Vagesna Unviels His New Movie Title
సినిమా వార్తలు

సతీష్ వేగేశ్న కొత్త సినిమా టైటిల్ 'కోతి కొమ్మ‌చ్చి'

డైరెక్ట‌ర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీహరి తనయుడు మేఘాంష్, సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న హీరోలుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దివంగత శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈరోజు స‌తీష్ వేగేశ్న పుట్టిన‌రోజు కావడంతో ఆ సందర్భంగా.. ఈ చిత్రానికి ‘కోతి కొమ్మ‌చ్చి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు. శతమానంభవతి, శ్రీనివాసకల్యాణం, ఎంత మంచివాడవురా ఇలా అచ్చతెలుగు టైటిళ్లు పెట్టడంలో స్పెషలిస్ట్ దర్శకుడు సతీష్ వేగేశ్న. అలానే మరోసారి తన సినిమాకు అచ్చమైన తెలుగు టైటిల్ ను పెట్టారు.

TFN Adminవాట్సాప్
V Movie First Lyrical Video Song Is Out.
సాంగ్

"V" మూవీ సాంగ్ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. అమిత్ త్రివేది సాంగ్స్ స్వరపరచగా, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ "V" మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
Naga Chaitanya New Movie Thank You Title Poster Is Out On Nagarjuna Birthday
ఫస్ట్ లుక్

నాగ్ బర్త్ డే - చైతు కొత్త సినిమా టైటిల్ ప్రకటన

టాలీవుడ్‌ కింగ్‌, మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో ఆయన 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నాగ్‌కు అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Shares A Glance Of Her Everyday Morning Routine.
సినిమా వార్తలు

కీర్తి సురేష్ సూర్య నమస్కారాలు

టాలీవుడ్ , కోలీవుడ్ లలో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ పలు తెలుగు , తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి ప్రస్తుతం "మిస్ ఇండియా ", "గుడ్ లక్ సఖి ", "రంగ్ దే "(తెలుగు )"అన్నాత్తే "(తమిళ ), "మరక్కార్ " (మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Tollywood Actor Naga Babu Shares His Perspective About Nepotism In Film Industry
సినిమా వార్తలు

టాలీవుడ్ 'నెపోటిజం' పై నాగబాబు .. స్టార్ కొడుకైనా కష్టపడాలి..!

'నెపోటిజం'.. ఈ అంశం ఎప్పుడు చర్చల్లోకి వస్తూనే ఉంటుంది. అయితే ఒకప్పుడు చాలా తక్కువ వినిపించే ఈ పదంపై ఇప్పుడు పెద్దఎత్తున డిబేట్లే జరుగుతున్నాయి. దానికి కారణం బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోడమే. నిజానికి సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో దానికి కారణం ఇంతవరకూ తెలియదు కానీ.. నెపోటిజం వల్లనే చనిపోయాడని మాత్రం ఆరోపణలు వచ్చాయి. దీనితో సినీ పరిశ్రమల్లో ఇప్పుడు నెపోటిజం పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతో మంది నటీనటులు కూడా దీనిపై స్పందించి తమ అభిప్రాయాలు వెల్లడించారు.

TFN Adminవాట్సాప్
Wild Dog Movie Team Unveils First Look Movie Poster On Akkineni Nagarjuna Birthday
ఫస్ట్ లుక్

డేర్ డెవిల్ కు హ్యాపీ బర్త్ డే

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని అగ్ర హీరో స్థాయి రేంజ్ కు ఎదిగారు టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున. టాలీవుడ్ మన్మధుడు అనే బిరుదుకు తగ్గట్టేఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ ఫిట్ నెస్ మైంటైన్ చేస్తూ ఆ బిరుదుకు సార్ధకం చేస్తున్నారు. క్లాస్.. మాస్ సినిమాలే కాదు భక్తిరస చిత్రాలకు కూడా నాగ్ కేరాఫ్ అడ్రస్. తన ఇన్నేళ్ల సినీప్రయాణంలో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించారు. ఇక ఈ రోజు నాగ్ పుట్టినరోజు కావడంతో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెపుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థమన్ 'బుధవారం' ట్వీట్ 'వకీల్ సాబ్' గురించా..?

రీసెంట్ గానే చిరు పుట్టిన రోజు అయిపోయింది. ఇక చిరు పుట్టిన రోజున కామన్ మోషన్ పోస్టర్, కామన్ డీపీ అంటూ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ బాగానే హడావుడి చేశారు. ఇక ఫ్యాన్స్ కోసం ఆచార్య నుండి ఒక అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం. మరి ఎంత సెలెబ్రేట్ చేయొద్దని చెప్పినా ఫ్యాన్స్ కదా ఏదో ఒక రకంగా తమ హీరోపై అభిమానంతో ఏదో ఒకటి చేస్తారు. అంతేకాదు తన సినిమా నుండి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని అదే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.

TFN Adminవాట్సాప్

షేర్