టాలీవుడ్ కింగ్, మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో ఆయన 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నాగ్‌కు అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే వైల్డ్ డాగ్ నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన తనయుడు హీరో నాగ చైతన్య తన కొత్త సినిమాను ప్రకటించారు. మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నాగ్ పుట్టిన రోజు కావడంతో ఈ రోజు టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు…మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Happy Birthday King @IamNagarjuna garu !!
Happy to announce our next with @Chay_Akkineni, titled ‘𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮’. #ThankYouTheMovie
Directed by @Vikram_K_Kumar
Produced by #DilRaju, #Shirish, #HarshithReddy #NC20 #HBDKingNagarjuna pic.twitter.com/1i9iwkdcfO— Sri Venkateswara Creations (@SVC_official) August 29, 2020
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: