“V” మూవీ సాంగ్ రిలీజ్

V Movie First Lyrical Video Song Is Out.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. అమిత్ త్రివేది సాంగ్స్ స్వరపరచగా, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ “V” మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” మూవీ లో హీరో నాని నెగటివ్ పాత్రలో నటించడం విశేషం. “V” మూవీ రిలీజ్ టైమ్ దగ్గరపడుతుండటం తో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ భారీ గా చేపట్టింది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఒక సాంగ్ ను రిలీజ్ చేసింది. అమిత్ త్రివేది స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన “వస్తున్నా .. వచ్చేస్తున్నా ” సాంగ్ ను శ్రేయ ఘోషల్ , అనురాగ్ కులకర్ణి , అమిత్ త్రివేది ఆలపించారు. సుధీర్ బాబు , నివేద థామస్ లపై తెరకెక్కిన ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eleven =