లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా తిరిగి వర్క్ మోడ్ లోకి వెళ్లనున్నట్టు తెలుపుతున్నారు. ఈ రోజు తన 61వ బర్త్ డే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా నాగార్జున వైల్డ్ డాగ్ నుండి స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ‘వైల్డ్ డాగ్’ బృందంలో సభ్యులైన అలీ రెజా (ఫీల్డ్ ఏజెంట్ – ఎన్ఐఏ), ఆర్యా పండిట్ (స్పెషల్ ఏజెంట్ – రా), కాలెబ్ మాథ్యూస్ (ఫీల్డ్ ఏజెంట్ – ఎన్ఐఏ), రుద్రా గౌడ్ (ఫీల్డ్ ఏజెంట్ – ఎన్ఐఏ), హష్వంత్ మనోహర్ (ఫీల్డ్ ఏజెంట్ – ఎన్ఐఏ) లను కూడా ఈ పోస్టర్ పరిచయం చేసింది. అంతేకాదు.. చైతు మూవీ అప్ డేట్ కూడా ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా నాగార్జున తన అభిమానులకి మరో గుడ్ న్యూస్ చెప్పారు.ఇన్నిరోజులు ఇంట్లోనే ఉన్న నాగ్ సోమవారం నుండి వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్‌తో పాటు బిగ్ బాస్ 4 షూటింగ్‌లో పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. అంతేకాక తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. కాగా బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ 6 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
So very happy to tell you that I am Going back to work again coming Monday👍😊💪With #BiggBossTelugu4 and #WildDog pic.twitter.com/c1lHQ73gWY
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 29, 2020




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: