2017 నుంచే ప్రెగ్నెంట్ గా ఉన్నా- సామ్ కౌంటర్

Samantha Akkineni Gives A Fun Counter To Question Asked By Audience On Instagram Live Chat

సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కు విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. మన సెలెబ్రిటీస్ ఏమన్నా తక్కువా.. వారి ప్రశ్నలకు తగ్గట్టే రివర్స్ లో కౌంటర్లు వేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక ప్రశ్నకే సమంతకు ఎదురవ్వగా.. సమంత ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియా క్వీన్ సామ్ ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో కూడా ముచ్చటిస్తూనే ఉంటుంది. అలానే తాజాగా ఇన్‌స్టాలో `ఆస్క్ సమంత` సెషన్‌ లో పాల్గొంది. ఈ సందర్భంగా.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే మీరు గర్భవతా? అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా… దానికి సమాధానంగా.. 2017 నుంచే తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానని.. అయితే బయటకు రావడానికి బేబీ ఇష్టపడటం లేదని కొంటెగా సమాధానమిచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి చైసామ్ పెళ్లి జరిగినప్పటి నుండి సమంత ప్రెగ్నెన్సీపై ఎన్నో ఫేక్ న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య సామ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ లేనప్పుడు కూడా ఇవే వార్తలు వచ్చాయి. అందుకే సమంతకు విసుగొచ్చినట్టుంది పరోక్షంగా సెటైర్ వేసింది.

ఇంకా కుకింగ్, ఫార్మింగ్‌లో ఏది ఇష్టం అంటే ఫార్మింగ్ అని సమాధానం ఇచ్చింది. హైట్ ఎంత అని మరో అభిమాని అడిగితే 5 అడుగుల మూడు అంగుళాలు అని సమాధానం తెలిపింది. తన చేతిపై ఉండే టాటూ గురించి చెపుతూ అది తనకు, తన భర్త నాగ చైతన్యకు చాలా ప్రత్యేకమైననదని చెప్పింది.

ఇక ఇన్ని రోజులు లాక్ డౌన్ వల్ల సమంత ఇంటికే పరిమితమైంది. ఇంట్లో చై, తన పెట్ డాగ్ తో పాటు కొత్తగా అర్బన్ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఇక తాజాగా మళ్ళీ వర్క్ మోడ్ లోకి వెళ్ళిపోయింది సామ్. తాను నటిస్తున్న ద ఫ్యామిలీ మ్యాన్ 2 డబ్బింగ్ కూడా చెప్పేసింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =