ప్రతి ఆర్టిస్ట్ కు ఆ కోరిక ఉంటుంది

Nivetha Thomas talks about V and many more things in this interview

కథల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా వుంటూ.. విభిన్నమైన పాత్రల్లో నటించే నటులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వాళ్లల్లో నివేదా థామస్ కూడా ఒకటని చెప్పొచ్చు. మొదటి నుండి స్క్రిప్ట్స్ విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటుంది నివేదా. అందుకే తను నటించే సినిమాలు మాగ్జిమం సక్సెస్ ను సొంతం చేసుకుంటాయి. ఇక ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నివేదా థామస్‌ ఈ సినిమా గురించి పలు విషయాలు పంచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈ సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌నే ఇప్పటివరకూ వెయిట్ చేసాం.. అయితే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు.. మ‌న‌కు అనుకూలంగా లేక‌పోవ‌డంతో సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి కుద‌ర‌లేదు. నిజానికి ‘వి’ సినిమాను తెర‌పై చూస్తే వ‌చ్చే ఫీలింగే వేరు. అలాగే ఓ ఆర్టిస్ట్‌కు త‌న సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసుకోవాల‌నే ఉంటుంది. ఎన్ని సినిమాలు చేసినా ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది.. మేం కూడా ‘వి’ సినిమాను అలాగే చూడాల‌నుకున్నాం. అయితే పరిస్థితి మీరు చూస్తున్నారుగా. అలాగే ఓటీటీలో ఇంత మంది స్టార్స్‌తో వ‌స్తున్న తొలి తెలుగు సినిమా ఇది… మ‌రి ఓటీటీలో ప్రేక్ష‌కుల రెస్పాన్స్ ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి కూడా అంద‌రిలో మొద‌లైంది. క‌చ్చితంగా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్ప‌గ‌ల‌ను అని నివేదా తెలిపింది.

ఈ సినిమాలో నేను అపూర్వ అనే క్రైమ్ న‌వ‌లా ర‌చ‌యిత పాత్ర‌లో క‌నిపిస్తాను. మోహ‌న్ సార్‌! క‌థ చెప్ప‌గానే బాగా క‌నెక్ట్ అయ్యాను. అపూర్వ పాత్ర ఎంత ఓబీడీయెంట్‌గా ఉంటుందో అంతే డేరింగ్, కాన్ఫిడెంట్‌‌గా క‌నిపిస్తుంది అని చెప్పింది.

కాగా నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించగా…థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =