టాలీవుడ్ , కోలీవుడ్ లలో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ పలు తెలుగు , తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి ప్రస్తుతం “మిస్ ఇండియా “, “గుడ్ లక్ సఖి “, “రంగ్ దే “(తెలుగు )”అన్నాత్తే “(తమిళ ), “మరక్కార్ ” (మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సడలింపులు తరువాత కూడా షూటింగ్స్ ప్రారంభం కాక పోవడం తో కీర్తి ఇంటికే పరిమితం అయ్యి సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , యోగా , వర్కౌట్స్ , సంగీత సాధన చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కీర్తి ఇప్పుడు సూర్య నమస్కారాలు ప్రారంభించారు. ఈ రోజు సూర్య నమస్కారాలు ప్రారంభించాననీ , 150 సూర్య నమస్కారాలు చేశాననీ, 200 సూర్య నమస్కారాలు తన టార్గెట్ అనీ , ఉదయమే సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఉత్సాహం , ఉల్లాసంగా ఉంటుందనీ , రక్త ప్రసరణ , రోగ నిరోధక శక్తి పెంపొందుతాయని , శరీరం లో ఉన్న చక్రాలు అన్నింటినీ ప్రకాశవంతం గా చేస్తాయని చెబుతూ కీర్తి తన సూర్య నమస్కారాలు వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: