ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ పాత్రలో కంగనా రనౌత్

Actress Kangana Ranaut To Play Air Force Pilot In Tejas Movie

సూపర్ హిట్ “గ్యాంగ్ స్టర్ ” మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన కంగనా రనౌత్ “ఫ్యాషన్ “, “తను వెడ్స్ మను “, “క్రిష్ 3”, “క్వీన్ “, “తను వెడ్స్ మను రిటర్న్స్ “, ” మణికర్ణిక” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “ఏక్ నిరంజన్ “తెలుగు మూవీ లో కంగనా రనౌత్ నటించారు. కంగనా రనౌత్ ప్రస్తుతం లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ మూవీ “తలైవి “తమిళ మూవీ లో జయలలిత పాత్రలో నటిస్తున్నారు. “తలైవి ” మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది. కంగనా ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో బ్లాక్ బస్టర్ “ఉరి ” మూవీ నిర్మించిన రోనీ స్క్రూ వాలా నిర్మాణ సారథ్యంలో సర్వేశ్ మేవారా దర్శకత్వంలో RSVP మూవీస్ బ్యానర్ పై కంగనా రనౌత్ ప్రధానపాత్రలో “తేజస్ ” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో కంగనా రనౌత్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ గా నటిస్తున్నారు. “తేజస్ ” మూవీ డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. “తేజస్ ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ .. “తేజస్ ” మూవీ లో భాగమైనందుకు గర్వంగా ఉందనీ , ధైర్య సాహసాలు గల మన ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కు భావగీతంలా ఈ మూవీ ఉంటుందని తెలిపారు. పైలట్ లుక్ లో కంగనా రనౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =