‘నెపోటిజం’.. ఈ అంశం ఎప్పుడు చర్చల్లోకి వస్తూనే ఉంటుంది. అయితే ఒకప్పుడు చాలా తక్కువ వినిపించే ఈ పదంపై ఇప్పుడు పెద్దఎత్తున డిబేట్లే జరుగుతున్నాయి. దానికి కారణం బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోడమే. నిజానికి సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో దానికి కారణం ఇంతవరకూ తెలియదు కానీ.. నెపోటిజం వల్లనే చనిపోయాడని మాత్రం ఆరోపణలు వచ్చాయి. దీనితో సినీ పరిశ్రమల్లో ఇప్పుడు నెపోటిజం పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతో మంది నటీనటులు కూడా దీనిపై స్పందించి తమ అభిప్రాయాలు వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా టాలీవుడ్ లో నెపోటిజం పై మాట్లాడుతూ పలు ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కొడుకు కాబట్టే బాలకృష్ణ.. నాగేశ్వరరావు కొడుకు కాబట్టే నాగార్జున అగ్ర నటులు అయ్యారని అనుకోవడం హాస్యాస్పదం.. తమ కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ ఎంతో కష్టపడి పైకి వచ్చారని ఆయన అన్నారు. వీరంతా తమ కెరీర్ కోసం ఎంతో శ్రమిస్తారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడతాడో అరవవింద సమేత సినిమా షూటింగ్ అప్పుడు స్వయంగా చూశా.. 44 డిగ్రీల ఎండలో షర్ట్ లేకుండా తారక్ ఫైట్ చేయడాన్ని కళ్లారా చూశా.. హీరో ఎంట్రీ ఇవ్వడానికి ముందు మహేశ్ బాబు కొంచం లావుగా ఉండేవాడని… కానీ, సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కేబీఆర్ పార్కులో రోజు రన్నింగ్ చేసేవాడని… కష్టపడి స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా మహేశ్ తయారైపోయాడని… ఇప్పుడు హాలీవుడ్ హీరోలా ఉంటాడు.. కష్టపడని వారికి సినీ పరిశ్రమలో చోటు లేదు… ఎంతటి స్టార్ కుమారుడినైనా… నచ్చకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తారని అన్నారు.
మరి నిజంగానే బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇలాంటి కాంపిటేటివ్ ఇండస్ట్రీలో రాణించడం అనేది కష్టం. కష్టపడాలి.. టాలెంట్ ఉండాలి.. అలాంటి నటీనటులను మన తెలుగు ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: