ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ – త్వరలోనే బిగ్ అనౌన్స్‌మెంట్..!

Jr NTR Trivikram movie latest update

తమ అభిమాన హీరో సినిమాల నుండి అప్ డేట్స్ రావడం లేట్ అయితే చాలు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. షూటింగ్ లు గట్రా ఏమన్నా ఉంటే వాళ్లు కూడా ఏదన్నా అప్ డేట్ ఇస్తారు. కానీ ప్రస్తుతం పరిస్థితి వేరు. అప్పటికీ ఫ్యాన్స్ కు ఊరట కలిగించేందుకు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. మొన్నటి వరకూ ప్రభాస్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూసారు. ఫైనల్ గా వారికి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చింది. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీ అయిపోయాడు. రాజమౌళి సినిమా కాబట్టి ఆ సినిమా నుండి అప్ డేట్స్ అంత ఈజీ గా రావు. పోనీ ఎన్టీఆర్ బర్త్ డే కి అయినా ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో వస్తుందేమో అనుకున్నారు కానీ రాలేదు. దీనితో ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్.

ఇక ఈ సినిమా గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలని, టైటిల్ విడుదల చేయాలని ఎన్టీయార్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా అడుగుతుండటంతో… దీంతో నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ట్విటర్ ద్వారా స్పందించారు. `యంగ్ టైగర్ ఎన్టీయార్ అన్న అభిమానులకు.. కొత్త సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇవ్వాలని అభిమానుల నుండి మెసేజెస్ వస్తున్నాయి.. షూటింగ్ ప్రారంభం కాగానే సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడిస్తాం. టైటిల్ ముందుగా రివీల్ చేయకూడదనే సెంటిమెంట్ మాకు ఉంది. మమ్మల్ని నమ్మండి. త్వరలోనే సినిమాకు సంబంధించి ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నామ`ని నాగవంశీ ట్వీట్ చేశారు. మరి ఎన్టీఆర్ అభిమానులు అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.

 

కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబోల వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − seven =