తెలుగు భాషాదినోత్సవం – మా తాత వల్లే నేర్చుకున్నా..!

Allu Sirish Remembers His Grand Father For Teaching Him Telugu Language On The Occasion Of Telugu Language Day

కేవలం వ్యక్తిగత విషయాలు.. సినిమా అప్ డేట్స్ మాత్రమే కాదు అప్పుడప్పుడు పలు ఆసక్తికర విషయాలు కూడా తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాడు అల్లు శిరీష్. ఇటీవలే గో లోకల్ బీ లోకల్ అని మన ఇండియన్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలని.. మన ఆర్థిక వ్యవస్థను కాపాడాలని కోరాడు. ఇక ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతే కాదు తన ట్వీట్ లో దేశభాషలందు తెలుగు లెస్స” – శ్రీ కృష్ణ దేవరాయలు. తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు, మీ అల్లు శిరీష్ అని ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. తనకు తెలుగు నేర్పిన తాతకు, తల్లికి శిరీష్ ధన్యవాదాలు తెలియజేశాడు. `చెన్నైలోని పాఠశాలల్లో తమిళ్, హిందీ మాత్రమే నేర్పేవారు. కానీ, మాతృభాష మాకు రావాలని మా తాతయ్య కోరుకునేవారు. అందుకే ప్రత్యేకంగా తెలుగు ట్యూషన్లు పెట్టించారు. ఆ తర్వాత మాకు తెలుగు నేర్పే బాధ్యతను మా అమ్మ తీసుకుంది. మాతృభాషను, తెలుగు సంస్క‌తిని నేర్పినందుకు వారిద్దరికీ ధన్యవాదాల`ని శిరీష్ మరో ట్వీట్ చేశాడు.

 

ఏబీసీడీ సినిమా తర్వాత ఇప్పటివరకు మరే కొత్త సినిమాను ప్రకటించలేదు అల్లు శిరీష్. ప్రస్తుతం త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రక‌ట‌నతో పాటు కీల‌క విష‌యాలు అతిత్వర‌లో ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =