ఓనం పండగ వేడుకలలో అనుపమ పరమేశ్వరన్

Onam Wishes From Anupama Parameswaran

కేరళ రాష్ట్రం లో ప్రజలు ఓనం పండగ ను ఆనందంగా , వైభవంగా జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఓనం పండగ వేడుకలను సంసృతి , సంప్రదాయం , ఆచారాలతో ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండగ లో పూల మాలలు , ముగ్గులు , కొత్త దుస్తులు , నృత్యాలు , పడవ పందెములు వంటివి ముఖ్యమైనవి. హిందూ మతానికి సంబంధించినప్పటికీ ఓనం పండగ ను హిందువులతో పాటు ముస్లిమ్స్ , క్రిస్టియన్స్ కూడా జరుపుకొనడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా లాక్ డౌన్ కారణంగా సుమారు 5 నెలల పాటు కేరళ లోని త్రిసూర్ జిల్లా ఇరింజలకూడ టౌన్ లో తన స్వంత ఇంటికే పరిమితం అయిన అనుపమ పరమేశ్వరన్ తన కుటుంబ సభ్యులతో ఓనం పండగ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ .. ప్రతీ సంవత్సరం ఓనం పండగ కు షూటింగ్స్ లో బిజీగా ఉండడం జరిగేదని , ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో పండగ సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వచ్చినందుకు చాల ఆనందంగా ఉందనీ , ఈ ఓనం పండగ తో ప్రజలంతా కొవిడ్ -19 నుండి ఫ్రీ అవ్వాలని కోరుకుంటున్నాననీ చెప్పారు. అనుపమ ప్రస్తుతం “కార్తికేయ 2 “, “18 పేజెస్ ” మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 20 =