ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 64
కూతురిని పరిచయం చేసిన నటి స్నేహ
అభిమానికి బ్రెయిన్ ట్యూమర్ - నాగార్జున ఫోన్ కాల్

మరో తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్

స్టన్నింగ్ యోగా భంగిమ లో పూజాహెగ్డే

త్వరలో "రాజు గారి గది 4 " మూవీ ?

క్వశ్చన్ మార్క్? తో వస్తున్న అదా

మొదలైన ‘గుర్తుందా శీతాకాలం’

మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో అనుపమ పరమేశ్వరన్ ?

'విద్యార్థి' టీజర్ విడుదల

"#NBK106" మూవీ కి స్పెషల్ సెట్
'నాంది' షూటింగ్ ఆగడం పై నరేష్ క్లారిటీ..!

సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ..!
‘ఆచార్య’ ఒరిజినల్ కథ - అవన్నీ తప్పుడు కథలు
రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్

" ఆకాశం నీ హద్దురా ! " మూవీ 200దేశాలలో రిలీజ్
ఈవారం టాలీవుడ్ ఇంపార్టెంట్ అప్ డేట్స్
ఈవారం టాలీవుడ్ ఇంపార్టెంట్ అప్ డేట్స్ మిస్ అయ్యారా.. డోంట్ వర్రీ మీ కోసం ఈ వారంలో జరిగిన విశేషాలు మరోసారి అందిస్తున్నాం. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒక లుక్కేయండి.
కూతురిని పరిచయం చేసిన నటి స్నేహ
టాలీవుడ్ లో హోమ్లీ హీరోయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు స్నేహ. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయికగా ఎన్నో సినిమాల్లో నటించి అలరించింది. శ్రీరామదాసు, పాండురంగడు అనే భక్తిరస సినిమాల్లో కూడా నటించింది. కెరీర్ మంచి ఫామ్ లో వున్నప్పుడే తమిళ నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. ఇక ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమైంది. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. ఆ మధ్య వినయ విధేయ రామ చిత్రంలో రామ్‌చరణ్‌కి వదినగా నటించిన స్నేహ రీసెంట్‌గా వచ్చిన తమిళ చిత్రం పటాస్‌లో మెరిసింది.
అభిమానికి బ్రెయిన్ ట్యూమర్ - నాగార్జున ఫోన్ కాల్
కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. తమ హీరోలకు అభిమానులంటే ఎంత ప్రేమ ఉంటుందో.. తమ అభిమానులపై కూడా అదే ప్రేమను... అదే అభిమానాన్ని చూపిస్తారు మన హీరోలు. ఇక అనారోగ్యంతో ఉన్న తమ అభిమానులను స్వయంగా కలిసిన హీరోలు కూడా చాలా మంది వున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్ ఇలా పలువురు హీరోలు తమ అభిమానుల లాస్ట్ విష్ ను తీర్చినవాళ్ళే.

మరో తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్
రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తాప్సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తాప్సీ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "హసీన్ దిల్ రుబా ", "శభాష్ మిథు " మూవీస్ లో తాప్సీ నటిస్తున్నారు. తాప్సీ ఇప్పుడు దక్షిణాది మూవీస్ పై ఫోకస్ పెట్టారు. జయం రవి హీరోగా రూపొందుతున్న "జనగణమన " మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయిన తాప్సీ మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

స్టన్నింగ్ యోగా భంగిమ లో పూజాహెగ్డే
బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే తెలుగు , హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే పూజాహెగ్డే వర్కౌట్స్ , యోగా లతో తన ఫిట్ నెస్ ను మరింత పెంపొందించుకుంటున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన యోగా వీడియోస్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

త్వరలో "రాజు గారి గది 4 " మూవీ ?
వారాహి చలన చిత్రం , ఏ కె ఎంటర్ టైన్ మెంట్ , ఓక్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా రూపొందిన హారర్ కామెడీ థ్రిల్లర్ "రాజు గారి గది " మూవీ 2015 సంవత్సరం అక్టోబర్ 16 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ సీక్వెల్ "రాజు గారి గది 2" మూవీ పివిపి సినిమా , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ , ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున , సమంత , సీరత్ కపూర్ లతో తెరకెక్కి 2017 సంవత్సరం అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ అయ్యింది.

క్వశ్చన్ మార్క్? తో వస్తున్న అదా
చాలా కాలం బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా చేస్తుంది అదా. విప్రా దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. “?”(క్వశ్చన్ మార్క్) అనే డిఫరెంట్ టైటిల్ ను ఈ సినిమాను ఫిక్స్ చేశారు. దానికి సంబంధించిన పోస్టర్ తో విడుదల చేసి ఆదా ఇప్పుడు ఆసక్తి రేపింది. ఇక ఈ టైటిల్ చూస్తుంటే లేడీ ఓరియెంటెడ్ గా ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది.

మొదలైన ‘గుర్తుందా శీతాకాలం’
సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను కూడా ఇటీవలే ఫిక్స్ చేశారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ తో పాటు తమన్నా లుక్‌ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఇప్పుడు ముందే చెప్పినట్టు ఈ రోజు ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితమే జరుపుకుంది. నాగశేఖర్ క్లాప్ కొట్టగా, సత్య హెగ్డే కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నాగశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి వారి ప్రేమకథను గుర్తుకు తెస్తుందని.. ఓ…

మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో అనుపమ పరమేశ్వరన్ ?
సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ "ప్రేమమ్ ", "శతమానం భవతి ", "హలో గురు ప్రేమకోసమే ","రాక్షసుడు "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మలయాళ , తమిళ , కన్నడ భాషల మూవీస్ లో నటిస్తున్న అనుపమ ఇప్పుడు వరుస తెలుగు మూవీస్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు. నిఖిల్ హీరోగా రూపొందుతున్న "కార్తికేయ 2 ", "18 పేజెస్ " మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయిన అనుపమ ఇప్పుడు ఒక మలయాళ మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

'విద్యార్థి' టీజర్ విడుదల
మధు మాదాసు దర్శకత్వంలో 'రాజుగారి గది' ఫేమ్ చేతన్ చీను, టిక్‌టాక్ ఫేమ్ వర్షిణి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'విద్యార్థి'. మహాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేటి రామకృష్ణ, వంశీ తాడికొండ భాగస్తులుగా ఆళ్ల వెంకట్ (ఏవీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. గుంటూరు, రాజమండ్రి, వైజాగ్, అరకు వంటి లొకేషన్లలో 42 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ జరిపారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్, నిర్మాతలు సాయి కొర్రపాటి, కె.ఎల్…

"#NBK106" మూవీ కి స్పెషల్ సెట్
మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యాక్షన్ ఎంటర్ టైనర్ "#NBK106" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "సింహా ", "లెజెండ్ " మూవీస్ తరువాత దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "#NBK106" రూపొందుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

కొరటాల సీరియస్-ఇది నా కథ.. అందరికీ వినిపించాలా..!
కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై రాజేష్ అనే వ్యక్తి ఈ కథ నాదే అని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఆరోపణలపై చిత్రయూనిట్ స్పందించి క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా అతను చెప్పిన కథ నచ్చలేదు కాబట్టే మేము ఆ సినిమాను చేయలేదని వారు వివరణ ఇచ్చారు. దానికి.. దీనికి సంబంధం లేదని అన్నారు. ఇక ఇప్పుడు ఈవార్తలపై కొరటాల కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

"వేయి శుభములు కలుగు నీకు " మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్
జయ దుర్గా దేవి మల్టీ మీడియా బ్యానర్ పై కిరణ్ &కిషోర్ సమర్పణలో రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు శివాజీరాజా తనయుడు , "ఏదైనా జరగొచ్చు " మూవీ ఫేమ్ విజయ్ రాజా హీరోగా హారర్ నేపథ్యం లో ప్రేమ కథా చిత్రం గా "వేయి శుభములు కలుగు నీకు " మూవీ రూపొందుతుంది. తమన్నా వ్యాస్ కథానాయిక. గ్యాని సంగీతం అందించారు. తూము నరసింహ పటేల్ నిర్మాత.
'నాంది' షూటింగ్ ఆగడం పై నరేష్ క్లారిటీ..!
వేటినైనా ఆపడం కష్టం కానీ రూమర్స్ ను ఆపడం మాత్రం చాలా కష్టం. అది కూడా సినిమా పరిశ్రమలో అయితే ఇంకా కష్టం. ఏదైనా సినిమా వస్తుందంటే అది రిలీజ్ అయ్యేంత వరకూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది.. ఇక ఆ రూమర్స్ ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే వుంటారు చిత్రయూనిట్ కూడా. ఇప్పుడు నాంది టీం కూడా అదే పనిలో పడింది. తాజాగా ఈ సినిమాపై కూడా ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆ సినిమా షూటింగ్ ఆపడంపై. అసలు సంగతేంటంటే..

సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ..!
ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్లు గా వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఎంతోమంది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసందే. హీరోయిన్లుగా కాదులే కానీ ఈ జనరేషన్ లో స్టార్ హీరోల పక్కన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఏదో పాత్ర దక్కింది చేస్తున్నాం అన్నట్టు కాకుండా.. దర్శకులు కూడా ఏదో వారిని తీసుకోవాలి.. పాత్ర ఇవ్వాలి అన్నట్టు కాకుండా.. సినిమాకే వాళ్ళు కీలక పాత్రలుగా చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే సినిమా నడిచే పాత్రలను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు రమ్యకృష్ణ, నదియా, విజయశాంతి, మీనా అలా పలువురు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కీలకపాత్రలతో అలరిస్తున్నారు.

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' డబ్బింగ్ స్టార్ట్ చేసిన సామ్
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది.

సూర్య 'ఓటీటీ' నిర్ణయం సరైనదే
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం థియేటర్స్ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని సూర్య నిర్ణయించుకున్న సంగతి కూడా తెలిసిందే.
‘ఆచార్య’ ఒరిజినల్ కథ - అవన్నీ తప్పుడు కథలు
అప్పుడప్పుడు కొన్ని సినిమాలపై పలు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. పలానా కథలు మావి అంటూ.. పలు పాటలు మావి అంటూ ఆరోపణలు చేస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా ఆచార్య సినిమాకు కూడా ఆరోపణలువస్తున్నాయి. రాజేష్ అనే వ్యక్తి ఆచార్య కథ తనదంటూ ఆరోపణలు చేయడంతో ఆచార్య టీం దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్
హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఖైదీ నెం 150 ", "సైరా నరసింహా రెడ్డి " మూవీస్ ను నిర్మించారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా "ఆచార్య " మూవీ ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

" ఆకాశం నీ హద్దురా ! " మూవీ 200దేశాలలో రిలీజ్
తమిళ స్టార్ హీరో సూర్య కు టాలీవుడ్ లో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . సూర్య హీరోగా రూపొందిన ప్రతీ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. "గజిని ", "యముడు "మూవీ సిరీస్ , "బందోబస్త్ ", "NGK " వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన సూర్య "రక్త చరిత్ర 2 "తెలుగు మూవీ లో నటించారు. హీరో సూర్య తన కొత్త మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.