సతీష్ వేగేశ్న కొత్త సినిమా టైటిల్ ‘కోతి కొమ్మ‌చ్చి’

Director Satish Vagesna Unviels His New Movie Title

డైరెక్ట‌ర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీహరి తనయుడు మేఘాంష్, సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న హీరోలుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దివంగత శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈరోజు స‌తీష్ వేగేశ్న పుట్టిన‌రోజు కావడంతో ఆ సందర్భంగా.. ఈ చిత్రానికి ‘కోతి కొమ్మ‌చ్చి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు. శతమానంభవతి, శ్రీనివాసకల్యాణం, ఎంత మంచివాడవురా ఇలా అచ్చతెలుగు టైటిళ్లు పెట్టడంలో స్పెషలిస్ట్ దర్శకుడు సతీష్ వేగేశ్న. అలానే మరోసారి తన సినిమాకు అచ్చమైన తెలుగు టైటిల్ ను పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాను ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కరోనా ప్రభావం కాస్త తగ్గిన తర్వాత షూటింగ్ ను మొదలు పెట్టాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

మరి ఇంతవరకూ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ విలువలతో సినిమాలు తీసిన సతీష్ వేగ్నేశ ఇప్పుడు ఈ ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ చిత్రం తెర‌కెక్కించ‌బోతున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎంతవరకూ సక్సెస్ అందిస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =