ఓటీటీ రిలీజ్ పై నాని – ఎవరో ఒకరు ధైర్యంగా స్టెప్ తీసుకోవాలి

Natural Star Nani about V movie OTT release

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘వి’ సినిమా ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. వచ్చే నెల సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయనున్నారు. ఇక ఓటీటీ లో తెలుగులో ఇప్పటివరకూ అన్నీ చిన్న సినిమాలే వచ్చాయి. ఇప్పటిదాకా ‘వి’ స్థాయి సినిమా ఏదీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాని ఓటీటీ రిలీజ్ పై మాట్లాడుతూ… ఈ సినిమాను మేము మార్చి లోనే రిలీజ్ చేద్దామనుకున్నాం.. లాక్ డౌన్ వల్ల చేయలేకపోయాం.. థియేటర్స్ ఓపెన్ అవుతాయేమో అని ఇప్పటివరకూ వెయిట్ చేసాం.. దాదాపు 6నెలలు అవుతుంది.. ఎవరో ఒకరు ధైర్యంతో ముందడుగు వేయాలి కదా.. సో ఫైనల్ గా మేమే ఆ స్టెప్ తీసుకున్నాం.. థియేటర్ ఎక్స్పీరియన్స్ ను ఏది బీట్ చేయలేదు.. కానీ కొన్ని మార్పులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి.. అది నేనే అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ నిర్ణయం పలువురిని ఇన్స్పైర్ చేస్తుందని అనుకుంటున్నా అని నాని తెలిపాడు.

కాగా నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో… జగపతిబాబు, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించగా…థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. మరి చూద్దాం ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =