థమన్ ‘బుధవారం’ ట్వీట్ ‘వకీల్ సాబ్’ గురించా..?

Thaman S tweet about Vakeel Saab goes viral Thaman S tweet about Vakeel Saab goes viral

రీసెంట్ గానే చిరు పుట్టిన రోజు అయిపోయింది. ఇక చిరు పుట్టిన రోజున కామన్ మోషన్ పోస్టర్, కామన్ డీపీ అంటూ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ బాగానే హడావుడి చేశారు. ఇక ఫ్యాన్స్ కోసం ఆచార్య నుండి ఒక అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం. మరి ఎంత సెలెబ్రేట్ చేయొద్దని చెప్పినా ఫ్యాన్స్ కదా ఏదో ఒక రకంగా తమ హీరోపై అభిమానంతో ఏదో ఒకటి చేస్తారు. అంతేకాదు తన సినిమా నుండి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని అదే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు థమన్ చేసిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచింది. థమన్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి వకీల్ సాబ్ నుండి అప్పుడప్పుడు థమన్ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా తన ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్ ఆసక్తినిరేపుతోంది.

థమన్ తన ట్విట్టర్‌లో ‘వెడ్ -నెస్-డే’ (బుధవారం) అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అంతే.. ‘వకీల్‌సాబ్’ హంగామా షురూ అయ్యింది. సోషల్ మీడియాలో అప్పుడే పవన్ ఫ్యాన్స్ హడావుడి మొదలెట్టేశారు. మరి థమన్ ‘బుధవారం’ అని ట్వీట్ అయితే చేశాడు కానీ, ఆ రోజు ఏం రిలీజ్ చేస్తున్నారు.. అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కొంతమంది మోషన్ పోస్టర్ అంటే కొంతమంది.. టీజర్ ఏమో అంటున్నారు. చూద్దాం మరి థమన్ బుధవారం సీక్రెట్ ఏంటో..

 

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seven =