కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 61

Anasuya Bharadwaj Urges Everyone To Donate Plasma To Save Life Of People Affected With Corona Virus
సినిమా వార్తలు

ప్లాస్మా దానానికై అనసూయ పిలుపు

కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారి ప్లాస్మా తో మరికొంతమంది కరోనా బాధితులను కాపాడవచ్చని తెలిసిన విషయమే. సైబరాబాద్ సి పి సజ్జనార్ ప్లాస్మా దానానికై ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజల తో పాటు సెలబ్రిటీస్ కూడా ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ వంటిదే ప్లాస్మా డొనేషన్ అనీ, భయపడాల్సిన అవసరం లేదనీ ప్రముఖ యాంకర్ అనసూయ ప్లాస్మా డొనేషన్ కై పిలుపు నిచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డిప్రెషన్ లో ఉన్నప్పుడు రజినీ సినిమాలు చూస్తానంటున్న మాజీ క్రికెటర్

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో అభిమానాలు వున్నారు ఆయనకు. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి కూడా ఆయనకు అభిమానులున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మలేషియా, జపాన్ లాంటి దేశాల్లో ఆయన సినిమాలు రిలీజ్ అయితే అక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేసే స్టామినా ఉన్న నటుడు రజినీకాంత్. సామాన్యులకు.. కేవలం సినిమా వాళ్ళకే కాదు ఎంతోమంది ప్రముఖులకు కూడా ఆయన జర్నీ ఒక స్ఫూర్తిదాయకం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్' - లంకేశునిగా సైఫ్ అలీఖాన్

ప్రభాస్ 22 సినిమా 'ఆదిపురుష్' అప్ డేట్స్ మాత్రం వెంట వెంటనే ఇచ్చేస్తున్నారు చిత్రయూనిట్. అనవసరమైన గాసిప్స్ రావడంకంటే ముందే క్లారిటీ ఇస్తే ఓ పనైపోతుంది అనుకుంటున్నారేమో కానీ సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ.. ఏదో ఒక క్లారిటీ ఇస్తూనే వున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పట్లో.. బాలకృష్ణ సినిమా కోసం చిరు ప్రచారం

ఇప్పుడు ఒక హీరో సినిమా ప్రమోషన్స్ కు మరొక హీరో రావడం కామన్ అయిపోయింది. అందుకు కారణం అప్పటి సినీ పరిశ్రమలో.. ఇప్పటి సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి. అప్పట్లో ఈ ప్రమోషన్స్ అవి ఇవి అంటూ అంత హడావుడి ఉండేది కాదు. సినిమా షూటింగ్ చేశామా.. కష్టపడ్డామా.. సినిమా రిలీజ్ అయ్యిందా.. అదేంటో మరి అప్పుడు ఎలాంటి ప్రచారాలు లేకపోయినా ప్రతి సినిమా దాదాపు హిట్టయ్యేది. ప్లాప్స్ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేయడం కూడా తక్కువే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ ఫ్యాన్స్ కు అండగా చరణ్, బన్నీ

పవన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలన్న నేపథ్యంలో ఆయన ఫ్లెక్సీ కడుతూ అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టి ముగ్గురు అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఘటన అటు అభిమానుల్లోనూ.. మెగా ఫ్యామిలీకి విషాదాన్ని మిగిల్చింది. ఇంకా పలువురు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. అంతేకాదు మృతుల కుటుంబాలు ఒక్కొక్క‌రికి రూ. 2ల‌క్ష‌ల చొప్పున ఆర్ధిక సాయం ప్ర‌క‌టించారు ప‌వ‌న్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సుదీర్ఘ ఆలోచనలతో పూజాహెగ్డే

బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా పూజాహెగ్డే కొనసాగుతున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న "రాధే శ్యామ్ ", అఖిల్ హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న పూజాహెగ్డే రెండు బాలీవుడ్ బిగ్ మూవీస్ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. స్టార్ హీరోల తో పాటు యంగ్ హీరోల తో నటిస్తూ పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై పూజాహెగ్డే ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

#PSPK28 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

ఫైనల్లీ పవన్ నాలుగో అప్ డేట్ కూడా వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి కూడా సర్ ప్రయిజ్ ఉన్నట్టు నిన్ననే తెలిపారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్ట‌ర్ లో స్టైలిష్ బైక్ క‌నిపిస్తుండ‌గా..దానిపై పెద్ద బాలశిక్ష పుస్త‌కం..బ్యాక్ డ్రాప్ లో నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌, జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ చిత్రాలు క‌నిపిస్తూ దేశ‌భ‌క్తిని స్మృశించేలా ఉంది. హ‌రీష్ శంకర్ కాన్సెప్ట్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కులు, అభిమానుల్లో అంచ‌నాల‌ను మ‌రింత పెంచేస్తుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"V" మూవీ ప్రమోషన్స్ లో నివేద థామస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. అమిత్ త్రివేది సాంగ్స్ స్వరపరచగా థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ -సురేందర్ రెడ్డి మూవీ లాంచ్ డేట్ ఖరారు..!

ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఉదయం నుండి అదే హడావుడి నడుస్తుంది. ఇక పవన్ సినిమాల నుండి కూడా బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. నిజానికి మూడు అప్ డేట్స్ మాత్రమే వస్తాయనుకున్నారు కానీ బోనస్ గా నాలుగో అప్ డేట్ కూడా వచ్చింది అదే సురేందర్ రెడ్డితో సినిమా. ఈ సినిమా ను కూడా అధికారికంగా ప్రకటించారు ఈరోజు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు పవన్ కు సన్నిహితుడైన రామ్ తళ్లూరి ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"ఉప్పెన "మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన "ఉప్పెన "మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణం గా రిలీజ్ వాయిదా పడింది. హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

'బిగ్ బాస్ 4' లో లేను.. ఫ్యూచర్ లో కూడా ఉండను

బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ మాత్రం వేరు అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 6 నుండి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఈ షో కోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. పలానా సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారంటూ కొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. హీరో కార్తికేయ, తరుణ్ లతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పటికే ఆవార్తలపై స్పందించి తాము బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయట్లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. మొన్నటికి మొన్న సినీనటి కల్పిక గణేశ్ కూడా…

TFN Adminవాట్సాప్
Actor Nithiin Attributes His Next Movie Title To Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

హీరో నితిన్ "దిల్ ఖుషి "

యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరం "భీష్మ " మూవీ తో విజయం సాధించి ఆనందం గా ఉన్నారు. వరుస మూవీస్ తో నితిన్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న "రంగ్ దే "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో కీర్తి సురేష్ కథానాయిక. దర్శకులు చంద్ర శేఖర్ యేలేటి , మేర్లపాక గాంధీ , కృష్ణ చైతన్య మూవీస్ కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు మరో మూవీ ని అనౌన్స్ చేయనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్రిష్ సినిమా నుండి పవన్ ప్రీ లుక్ రిలీజ్

మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఈరోజు. ఒక అప్ డేట్ తర్వాత మొరొకటి ఇస్తూ ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హడావుడి నడుస్తుంది. ఈ రోజు ఉదయం 9.9 నిమిషాలకు వకీల్ సాబ్ నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ ఆనందంలో ఉండగానే పవన్ 29 సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. పవన్ 29 సినిమా ముందు అనుకున్నట్టే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే తెరకెక్కుతుంది. ఇక ఆ సంతోషంనుండి తేరుకోకముందే క్రిష్ నుండి అప్ డేట్ వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
Director Surender Reddy Confirms His Next With Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

#PSPK29 - సురేందర్ రెడ్డితో కన్ఫామ్

రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వేణు శ్రీరామ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో.. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. ఇక పవన్ 29 సినిమాపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొన్ని సార్లు.. డాలీ దర్శకత్వంలో అని కొన్ని సార్లు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కి కూడా బ్రేక్ వేస్తూ ఈ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ పవన్ 29వ సినిమా అప్ డేట్ కూడా ఇచ్చేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ స్టార్ కు సూపర్ స్టార్ బర్త్ డే శుంభాకాంక్షలు

ఈ రోజు (సెప్టెంబర్ 2 ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సినీ , రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా "వకీల్ సాబ్ " మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ మరణంపై పవన్ స్పందన- ఇది మాటలకు అందని విషాదం

తమ అభిమాన హీరో పుట్టిన రోజును పండుగలా జరుపుకుందామని అభిమానాలు అనుకునేలోపే అనుకోని విషాదం జరిగిపోయింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండ‌లం ఏడ‌వ‌మైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే క‌టౌట్ క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఆ స‌మ‌యంలో విద్యుత్ వైర్లు త‌గ‌ల‌డంతో ఒక్క‌సారిగా కరెంట్ షాక్ కు గురై సోమ‌శేఖ‌ర్‌, అరుణాచ‌ల‌నం, రాజేంద్ర అనే ముగ్గురు వ్యక్తులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మరి కొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇక అభిమానుల మరణ వార్త విన్న పవన్ అభిమానుల మృతి ప‌ట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు సమంత బర్త్ డే శుభాకాంక్షలు

తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తితో సేంద్రియ పద్ధతిలో వెజిటబుల్స్ పండిస్తున్నారు. ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

‘ది చేజ్’ అంటున్న కార్తీక్ రాజు - ఫస్ట్ లుక్ రిలీజ్

సందీప్ కిష‌న్ తో నిను వీడ‌ని నీడ‌ను నేనే అనే సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ రాజు. ప్రస్తుతం రెజీనా ప్రధానపాత్రలో 'నేనే నా' మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. తమిళ్ లో హిట్టైన ‘‘ప్యార్ ప్రేమ కాదల్’’మూవీ ఫేం ‘‘రైజా విల్సన్’’ మెయిన్ లీడ్ గా ‘ది చేజ్’ అనే తెలుగు,తమిళ బైలింగ్వల్ మూవీని రూపొందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసాడు. చూడటానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది ఫస్ట్ లుక్.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'వకీల్ సాబ్' మోషన్ పోస్టర్ రిలీజ్

మొత్తానికి పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టైం రానే వచ్చేసింది. నిజానికి ఈ బర్త్ డే ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళ నుండి పుట్టినరోజులు జరుగుతున్నా ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చింది లేదు. రెండేళ్ల తర్వాత వస్తున్నా అభిమానులను ఏ మాత్రం నిరాశకు గురిచేయకుండా తను చేస్తున్న మూడు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ తో వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : పవన్ కళ్యాణ్ బెస్ట్ మూవీ ?

శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్ పై ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "ఖుషి " మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఖుషి "మూవీ లో ఉన్న 4 ఫైట్స్ ను పవన్ కళ్యాణ్ కంపోజ్ చేయడం విశేషం. "ఖుషి "మూవీ 8 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్

షేర్