‘బిగ్ బాస్ 4’ లో లేను.. ఫ్యూచర్ లో కూడా ఉండను

Singer Sunitha Gives Clarification That She Will Never Participate As A Contestant In Bigg Boss Show

బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ మాత్రం వేరు అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 6 నుండి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఈ షో కోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. పలానా సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారంటూ కొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. హీరో కార్తికేయ, తరుణ్ లతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పటికే ఆవార్తలపై స్పందించి తాము బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయట్లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. మొన్నటికి మొన్న సినీనటి కల్పిక గణేశ్ కూడా స్పందిస్తూ, ఈ రియాల్టీ షోలో ఇప్పుడే కాదు, ఎప్పటికీ తనను చూడలేరని తెలిపింది. భవిష్యత్తులో కూడా ఈ షోలో తాను పాల్గొనబోనని స్పష్టం చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సెలెబ్రిటీ పై కూడా తను ఈ షో లో పాల్గొనట్లేదని స్పష్టం చేసింది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు సింగర్ సునీత. సింగర్ సునీత కూడా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు వార్తలు రాగా దీనిపై స్పందించిన సునీత ‘నా ప్రియమైన మిత్రులారా.. నేను బిగ్‌బాస్ 4 తెలుగులో లేను.. భవిష్యత్తులోనూ ఉండను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్’ అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కాగా ఇటీవలే సునీత కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే.

మరి ఈసారి ఏ సెలెబ్రిటీస్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయడానికి వెళ్తున్నారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఈసారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తుండగా.. ఇప్పటికే షో ప్రోమో వీడియోలను విడుదల చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 6 =