ప్రభాస్ 22 సినిమా ‘ఆదిపురుష్’ అప్ డేట్స్ మాత్రం వెంట వెంటనే ఇచ్చేస్తున్నారు చిత్రయూనిట్. అనవసరమైన గాసిప్స్ రావడంకంటే ముందే క్లారిటీ ఇస్తే ఓ పనైపోతుంది అనుకుంటున్నారేమో కానీ సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ.. ఏదో ఒక క్లారిటీ ఇస్తూనే వున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్న “ఆదిపురుష్” చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ రానుంది అని దర్శకుడు ఓం రౌత్ తెలిపాడు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ అది ఏమిటా అని ఆసక్తిగా ఎదురు చూసారు. 7 గంటల 11 నిమిషాలకు ఆ అప్డేట్ ను రివీల్ చేసారు. “7000 వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షసుడు ఉద్భవించాడు” అని ట్వీట్ చేస్తూ `ఆదిపురుష్`లోనూ విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో కూడా చెప్పేసాడు. రాముడితో తలపడే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. సైఫ్ ను లంకేశునిగా చూపించనున్నట్టు ఖరారు చేసారు. ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ఒకరితో ఒకరు తలపడనున్నారు. కాగా ఓం రౌత్ రూపొందించిన `తానాజీ` చిత్రంలో కూడా సైఫ్ విలన్ పాత్రలో నటించి మెప్పించిన సంగతి విదితమే. మరి హీరోయిన్ పై కూడా త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూద్దాం..
7000 years ago existed the world’s most intelligent demon! #Adipurush#Prabhas #SaifAliKhan @itsBhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/xVPrlJQSKF
— Om Raut (@omraut) September 3, 2020
కాగా మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: